ప్రపంచ నెం.1 నొజొమి ఒసాకా (జపాన్) ఫ్రెంచ్ ఓపెన్ రెండో మ్యాచ్‌లో విజయం కోసం తీవ్రంగా శ్రమించింది. తొలి మ్యాచ్‌లో మూడు సెట్లు పోరాడి ఎలాగోలా ముందంజ వేసిన ఆమె.. రెండో రౌండ్లో ఓటమి కోరల్లోంచి బయటపడి టోర్నీలో నిలిచింది. గురువారం హోరాహోరీగా సాగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో ఒసాకా 4-6, 7-5, 6-3తో బెలారస్ భామ విక్టోరియా అజరెంకాపై చెమటోడ్చి నెగ్గింది.
తొలి సెట్లో ఓడి.. రెండో సెట్లోనూ 2-4తో వెనకబడి ఓటమి అంచున నిలిచిన ఒసాకా.. అసాధారణంగా పుంజుకుని విజయాన్ని సొంతం చేసుకుంది. రెండు గంటల 50 నిమిషాలు జరిగిన ఈ పోరులో అజరెంకా 52 విన్నర్లు కొట్టినా 43 అనసవర తప్పిదాలు చేసింది.
-
💪🏾💪🏾💪🏾
— Tennis Channel (@TennisChannel) May 30, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
World No. 1 @Naomi_Osaka_ battles past Azarenka 6-4, 7-5, 6-3. #RG19 pic.twitter.com/IXH6VjTS2B
">💪🏾💪🏾💪🏾
— Tennis Channel (@TennisChannel) May 30, 2019
World No. 1 @Naomi_Osaka_ battles past Azarenka 6-4, 7-5, 6-3. #RG19 pic.twitter.com/IXH6VjTS2B💪🏾💪🏾💪🏾
— Tennis Channel (@TennisChannel) May 30, 2019
World No. 1 @Naomi_Osaka_ battles past Azarenka 6-4, 7-5, 6-3. #RG19 pic.twitter.com/IXH6VjTS2B
మరోవైపు అమెరికా తార సెరెనా విలియమ్స్ 6-3, 6-2తో నారా (జపాన్)ను ఓడించి మూడో రౌండ్ చేరింది. హలెప్ (రొమేనియా) 6-4, 5-7, 6-3తో లినెటె (పోలెండ్) నెగ్గింది. బెన్సిచ్ (స్విట్జర్లాండ్), సమంత స్టోసర్ (ఆస్ట్రేలియా), బార్టీ (ఆస్ట్రేలియా) మూడో రౌండ్ చేరారు.
పురుషుల విభాగంలో...
టాప్‌సీడ్ నొవాక్ జకోవిచ్ మూడో రౌండ్లో ప్రవేశించాడు. రెండో రౌండ్లో జకో 6-1, 6-4, 6-3తో లాక్సొనెన్ (స్విట్జర్లాండ్)ను ఓడించాడు. ఆస్ట్రియా కుర్రాడు డొమినిక్ థీమ్ 6-3, 6-7 (6-8), 6-3, 7-5తో బబ్లిక్ (కజకిస్థాన్)పై చెమటోడ్చి గెలవగా, మోన్‌ఫిల్స్ (ఫ్రాన్స్) 6-3, 6-4, 6-4తో మానారియో (ఫ్రాన్స్)ను ఓడించాడు.
అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), బోర్నా కొరిచ్ (క్రొయేషియా), బటిస్టా అగట్ (స్పెయిన్) ముందంజ వేశారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో దివిజ్ శరణ్-అయామా (జపాన్) తొలి రౌండ్లోనే ఓడారు. దివిజ్ జోడీ 3-6, 6-2, 7-10తో కిచెనొక్ (ఉక్రెయిన్)-గోంజెలజ్ (మెక్సికో) చేతిలో పరాజయం చవిచూసింది.