ETV Bharat / sports

టెన్నిస్ స్టార్ షరపోవా.. అతనికి ఓకే చెప్పింది!

author img

By

Published : Dec 18, 2020, 10:53 PM IST

టెన్నిస్ దిగ్గజం మారియా షరపోవా నిశ్చితార్థం చేసుకుంది. ఇన్​స్టా వేదికగా తన జీవిత భాగస్వామిని నెటిజన్లకు పరిచయం చేసింది. త్వరలో పెళ్లిపై స్పష్టత ఇవ్వనుంది ఈ క్రీడాకారిణి.

షరపోవా.. అతనికి ఓకే చెప్పింది!
Maria Sharapova announces engagement with UK millionaire

రష్యా టెన్నిస్ క్రీడాకారిణి మారియా షరపోవా తనకు కాబోయే వాడి గురించి వెల్లడించింది. తనతో మూడేళ్లుగా రిలేషన్​షిప్​లో ఉన్న బ్రిటన్​ వ్యాపారవేత్త అలెగ్జాండర్ గిల్కిస్​తో నిశ్చితార్థం జరిగిన విషయాన్ని చెప్పింది. సామాజిక మాధ్యమాల్లో ఫొటోల్ని పోస్ట్ చేసింది.

గతేడాది షరపోవా వేలికి ఉంగరం కనిపించినప్పటి నుంచీ వారిద్దరూ పెళ్లి చేసుకుంటారనే ఊహాగానాలు విపరీతంగా వచ్చాయి. ఇప్పుడు ఆ విషయమై స్పష్టతనిచ్చింది.

ఇప్పటివరకు ఐదు గ్లాండ్​స్లామ్ టైటిళ్లు గెలుచుకున్న షరపోవా.. గతంలో పలువురితో బంధం కొనసాగించింది. 2010లో స్లోవేకియా బాస్కెట్​బాల్​ క్రీడాకారుడు శాశతో నిశ్చితార్థం జరిగింది. కానీ 2012లో వారిద్దరూ విడిపోయారు. బల్గేరియా టెన్నిస్ క్రీడాకారుడు​ దిమిత్రోవ్​తో రెండేళ్ల పాటు డేటింగ్ చేసి, 2015లో విడిపోయింది. వ్యాపారవేత్త గిల్కిస్​.. గతంలో ఓ ఫ్యాషన్ డిజైనర్​ను విహాహం చేసుకుని 2016లో విడిపోయారు.

ఇదీ చూడండి: టెన్నిస్​కు కర్మన్​ కౌర్ లాంటి అందం తోడైతే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.