ETV Bharat / sports

యుఎస్​ ఓపెన్​కు కజ్​నెత్సొవా దూరం

author img

By

Published : Aug 11, 2020, 11:57 AM IST

Updated : Aug 11, 2020, 2:32 PM IST

టెన్నిస్​ గ్రాండ్​స్లామ్​ టోర్నీ యూఎస్​ ఓపెన్​కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కరోనా భయంతో ఇప్పటికే ఈ మెగాటోర్నీ నుంచి టాప్​ ప్లేయర్లు తప్పుకున్నారు. తాజాగా మాజీ ఛాంపియన్​ కుజ్​నెత్సొవా అదే జాబితాలో చేరింది.

us open 2020 news
యుఎస్​ ఓపెన్​కు కజ్​నెత్సొవా దూరం

కరోనా మహమ్మారి ప్రభావంతో యుఎస్​ ఓపెన్​ నుంచి మరో స్టార్​ క్రీడాకారిణి వైదొలిగింది. 2004 యుఎస్​ ఓపెన్​ ఛాంపియన్​ స్వెత్లానా కుజ్​నెత్సొవా (రష్యా) ఈ టోర్నీకి దూరమవుతున్నట్లు ఇన్​స్టాగ్రామ్​లో ప్రకటించింది.

"యుఎస్​ ఓపెన్​ నుంచి తప్పుకుంటున్నందుకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఈ టోర్నీలో ఆడేందుకు చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్నా. కరోనా నా ప్రణాళికలన్నింటిని దెబ్బ కొట్టింది" అని కుజ్​నెత్సొవా చెప్పింది.

2009లో ఫ్రెంచ్​ ఓపెన్​ గెలిచిన ఈ రష్యా తార.. ప్రపంచ ర్యాంకింగ్స్​లో అత్యుత్తమంగా రెండో స్థానానికి చేరింది. ప్రస్తుతం ఆమె 35వ ర్యాంకులో ఉంది. ఇప్పటికే ప్రపంచ నంబర్​ వన్​ ఆష్లే బార్టీతో పాటు రఫెల్​ నాదల్​, వావ్రింకా, కిర్గియోస్, స్వితోలినా, బెర్టిన్స్​​ ​లాంటి స్టార్లు ఈ గ్రాండ్​స్లామ్​ టోర్నీకి దూరమయ్యారు. ఆగస్టు 31 నుంచి యుఎస్​ ఓపెన్​ ఆరంభం కానుంది.

Last Updated : Aug 11, 2020, 2:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.