ETV Bharat / sports

రోహిత్, రాహుల్, కోహ్లీని ఇమిటేట్ చేసిన పాక్ బౌలర్ - టీ20 ప్రపంచకప్

​టీమ్​ఇండియా సారథి కోహ్లీ సహా ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్​ను ఇమిటేట్ చేశాడు పాక్​ ఆటగాడు షాహీన్ అఫ్రిది(Shaheen Afridi News). పాకిస్థాన్-నమీబియా మ్యాచ్​లో ఈ సంఘటన జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్​గా మారింది.

shaheen afridi
షాహీన్ అఫ్రిది
author img

By

Published : Nov 11, 2021, 5:31 AM IST

టీ20 ప్రపంచకప్​లో పాకిస్థాన్​తో మ్యాచ్​లో టీమ్​ఇండియా(IND vs PAK T20) ఘోరంగా ఓడిపోయింది. ఈ మ్యాచ్​లో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్​ను పెవిలియన్​కు పంపిన పాకిస్థాన్ పేసర్ షాహీన్ అఫ్రిది.. నమీబియాతో మ్యాచ్​లో వారితో పాటు కోహ్లీని అనుకరించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్​గా మారింది.

నమీబియా బ్యాటింగ్​ చేస్తున్న సమయంలో షాహీన్ అఫ్రిది బౌండరీ లైన్​ వద్ద ఉన్నాడు. అయితే.. స్టేడియంలో ఉన్న పాక్​ అభిమానులు తొలుత 'రోహిత్.. రోహిత్'​ అంటూ అరిచారు. దీంతో రోహిత్ ఔట్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగిన తీరును ఇమిటేట్ చేశాడు షాహీన్. అనంతరం అభిమానులు రాహుల్ పేరు చెప్పగా.. అతడు క్లీన్​ బౌల్డ్​ అయిన తీరును ఇమిటేట్ చేశాడు.

పాక్​ మ్యాచ్​లో టీమ్​ఇండియా సారథి నిలకడగా రాణించాడు. చివర్లో షహీన్ వేసిన షార్ట్​ డెలివరీ ఆడబోయి రిజ్వాన్​ చేతికి చిక్కాడు. అయితే.. నమీబియాతో మ్యాచ్​లో కోహ్లీ ఔట్ అయిన తీరును కూడా చేసి చూపించాడు షాహీన్ అఫ్రిది.

టీ20 ప్రపంచకప్​లో పాకిస్థాన్​ వరుస విజయాలతో సెమీస్​ చేరుకుంది. గురువారం (నవంబర్ 11) దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియాతో తలపడనుంది.

ఇదీ చదవండి:

NZ vs ENG T20: అదరగొట్టిన అలీ.. కివీస్ లక్ష్యం 167

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.