టీ20 ప్రపంచకప్(t20 world cup 2021)లో భాగంగా నేడు (నవంబర్ 3) అఫ్గానిస్థాన్‌తో తలపడనుంది టీమ్ఇండియా(ind vs afg t20). ఇప్పటికే రెండు మ్యాచ్‌ల్లో ఓడి సెమీస్ అవకాశాల్ని సంక్లిష్టం చేసుకున్న భారత్.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో ఈ పోరుపై స్పందించాడు వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్(harbhajan singh news). చిన్న జట్టే కదా అని అఫ్గాన్‌ను తేలికగా తీసుకోవద్దని కోహ్లీసేనకు సూచించాడు. టీ20ల్లో ఫలితాన్ని ఊహించలేమని తెలిపాడు.
"అఫ్గానిస్థాన్‌ను తేలికగా తీసుకోవద్దు. ఆ జట్టు చాలా అనుభవం కలిగింది. అద్భుత బ్యాటర్లు, ముజిబుర్ రెహ్మన్, రషీద్ ఖాన్ లాంటి అత్యుత్తమ స్పిన్నర్లు ఆ టీమ్‌లో ఉన్నారు. టీ20ల్లో ఎవరు గెలుస్తారో ఊహించడం కష్టం. తొలి 6 ఓవర్లలో ఎవరు ఆధిపత్యం వహిస్తారో వారికే మ్యాచ్ గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత మ్యాచ్‌లో పుంజుకునే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది."
-హర్భజన్ సింగ్, వెటరన్ స్పిన్నర్
అఫ్గానిస్థాన్‌పై భారత్(ind vs afg t20 records) విజయశాతం బాగుంది కదా అన్న ప్రశ్నకు ఈ విధంగా స్పందించాడు భజ్జీ(harbhajan singh news). "ఓ క్రికెటర్‌గా నేను గత రికార్డుల గురించి పట్టించుకోను. ఒకసారి జరిగింది మళ్లీ జరుగుతుందని చెప్పలేం. ఉదాహరణకు పాకిస్థాన్‌ను 12 సార్లు ఓడించాం. మరి 13వ సారి అలాగే జరగాలి కదా. గతాన్ని మనం మార్చలేం. అఫ్గాన్‌ను కూడా గతంలో ఓడించాం. కానీ ఇప్పుడు ఆ జట్టు బలంగా తయారవుతోంది. పెద్ద జట్లను ఓడించే సామర్థ్యం ఈ జట్టుకు ఉంది" అని వెల్లడించాడు.
సెమీస్ బెర్తు కోసం ఆశలు!
సెమీస్ బెర్తు దక్కాలంటే ఈ మ్యాచ్‌తో పాటు మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ భారీ తేడాతో టీమ్ఇండియా గెలవాల్సి ఉంటుంది. అలాగే అఫ్గాన్ చేతిలో న్యూజిలాండ్(nz vs afg t20) తక్కువ తేడాతో ఓడిపోవాలి. అప్పుడు 6 పాయింట్లతో ఉన్న కోహ్లీసేన మంచి రన్‌రేట్‌తో సెమీస్‌కు క్వాలిఫై అవుతుంది.