ETV Bharat / sports

యంగ్​ ఛాంపియన్స్​.. వీరు ఆడితే లోకమే ఆడదా - manu bhaker news

అందం, అభినయం, ఆత్మస్థైర్యంలో ఎప్పుడో ప్రతిభ చూపిన అతివలు.. మైదానంలోనూ వారి సత్తాను చాటారు. దేశీయ, అంతర్జాతీయ క్రీడల్లో ఓ వెలుగు వెలిగారు. మహిళా దినోత్సవం సందర్భంగా అలాంటి క్రీడాకారిణులపై ప్రత్యేక కథనం.

Women's Day Special: young champions
యంగ్​ ఛాంపియన్స్​.. వీరు ఆడితే లోకమే ఆడదా
author img

By

Published : Mar 8, 2020, 6:48 AM IST

క్రికెట్​ అంటే సచిన్​, రన్నింగ్​ అంటే ఉస్సేన్​ బోల్ట్​, షూటింగ్​ అంటే అభినవ్​ బింద్రా పేర్లే తెలిసిన రోజుల్లో వారికంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు. అతి చిన్న వయసులోనే మైదానంలో దిగి.. అనుకున్న రంగంలో విజయం సాధించి.. ఇప్పటికీ పతకాల వేటలో పోరాటాన్ని సాగిస్తున్నారు. వారి కోసం ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం.

షెఫాలీ వర్మ

15 ఏళ్ల వయసులో ఎవరైనా ఏం చేస్తారు.. స్కూల్లో స్నేహితులతో సరదాగా గడుపుతూ.. చదువుల్లో మునిగితేలుతుంటారు. కానీ టీమిండియా మహిళా క్రికెటర్ షెఫాలీ వర్మ మాత్రం అంతర్జాతీయ క్రికెట్​లో రికార్డులు సృష్టిస్తోంది. ఆ వయసులోనే అర్ధశతకం చేసిన భారత క్రికెటర్​గా నిలిచింది షెఫాలీ వర్మ. 30 ఏళ్లుగా ఉన్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ రికార్డును బద్దలు కొట్టింది.

Women's Day Special: young champions
షెఫాలీ వర్మ

మాస్టర్​ను ఆదర్శంగా తీసుకొని క్రికెట్​లో ఓనమాలు దిద్దిన షెఫాలీ.. ఇప్పుడు అంతర్జాతీయ రికార్డులు అందుకుంటుంది. స్టార్ ప్లేయర్ మిథాలీ రాజ్ రిటైర్మెంట్​తో టీ20ల్లోకి వచ్చింది షెఫాలీ. ప్రస్తుతం ఆమె స్థానంలో ఆడుతోంది. గత నెలలో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్​తో అంతర్జాతీయ మ్యాచ్​ల్లో అరంగేట్రం చేసింది.

హిమాదాస్​

ఈ ఏడాది జులైలో జరిగిన టోర్నీల్లో 20 రోజుల వ్యవధిలో 5 స్వర్ణాలు గెల్చుకుంది భారత అథ్లెట్ హిమాదాస్. ఈ 19 ఏళ్ల స్ప్రింటర్ 200 మీటర్ల రేసులోనే 4 మెడల్స్ సాధించింది. 400 మీటర్ల విభాగంలో ఐదో పసిడి కైవసం చేసుకుంది. ప్రస్తుతం టోక్యో ఒలింపిక్స్​కు సన్నద్ధమవుతోంది. అసోంలోని మారుమూల గ్రామంలో రైతు కుటుంబానికి చెందిన హిమ.. వివిధ బ్రాండ్ల ద్వారా ఏడాదికి రూ.30 నుంచి 35 లక్షలు ఆర్జిస్తుంది. అంతేకాకుండా ఎక్కువగా ప్రభావితం చేసిన అథ్లెట్​గా ఫోర్బ్స్ ఇండియా టాప్-30లో చోటు దక్కించుకుంది. యూనిసెఫ్​లో భారత తొలి యూత్ అంబాసిడర్​గా నియమితులైంది.

Women's Day Special: young champions
హిమా దాస్​

మనిక బత్రా

టెన్నిస్‌లో సానియా.. బ్యాడ్మింటన్‌లో సైనా, సింధు.. మరి టేబుల్‌ టెన్నిస్‌లో..? జవాబివ్వడానికి ఆలోచించాల్సిన పనిలేకుండా చేసింది దిల్లీ అమ్మాయి మనిక బత్రా. ముఖ్యంగా కామన్వెల్త్‌ క్రీడల్లో మనిక ప్రదర్శన అద్భుతం. రెండు స్వర్ణాలు, ఓ రజతం, ఓ కాంస్యం ఖాతాలో వేసుకుందామె. వ్యక్తిగత విభాగంతో పాటు టీమ్‌లోనూ స్వర్ణాలు సాధించింది మనిక. చైనా, కొరియాల నుంచి తీవ్రమైన పోటీ ఉన్న ఆసియా క్రీడల్లోనూ శరత్‌ కమల్‌తో కలిసి మిక్స్‌డ్‌ డబుల్స్‌లో కాంస్యం గెలిచి అగ్రశ్రేణి క్రీడాకారిణిగా ఎదిగింది మనిక.

Women's Day Special: young champions
మనిక బత్రా

రాధా యాదవ్​

కూరగాయలు అమ్మే కుటుంబం నుంచి వచ్చిన రాధా.. ప్రస్తుతం మైదానంలో వికెట్ల సాగు చేస్తోంది. మహిళల టీ20 ప్రపంచకప్‌లో తొలి రెండు మ్యాచ్​లో అవకాశం పొందని ఈ అమ్మాయి.. మూడో మ్యాచ్​లో వచ్చిన ఛాన్స్​ను ఒడిసి పట్టుకుంది. న్యూజిలాండ్​తో జరిగిన పోరులో బౌలింగ్​లో ఒక వికెట్​ తీయడమే కాకుండా 14 పరుగులు చేసింది.

Women's Day Special: young champions
రాధా యాదవ్​

అంతేకాకుండా రెండు అద్భుత క్యాచ్​లతో మ్యాచ్​ స్వరూపాన్ని మార్చేసింది. శ్రీలంకతో జరిగిన ఆఖరి లీగ్​ ​పోరులోనూ.. తన లెఫ్టార్మ్‌ ఆఫ్‌ స్పిన్‌తో నాలుగు వికెట్లు కూల్చి జట్టును విజయపథంలో నడిపించింది. ఈ ప్రదర్శనలతో రాధ ఒక్కసారిగా క్రికెట్‌ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకుంది.

పివీ సింధు

2016 ఒలిపింక్స్​లో బాడ్మింటన్ మహిళల సింగిల్స్​లో ఫైనల్​కు చేరిన సింధు.. త్రుటిలో స్వర్ణాన్ని కోల్పోయి రజతంతో సరిపెట్టుకుంది. ఈ ఏడాది జరగనున్న టోక్యో ఒలింపిక్స్​లో బంగారు పతకాన్ని సాధించాలని పట్టుదలతో ఉంది. ప్రస్తుతం ఫామ్​లో లేక సింధు పెద్దగా రాణించట్లేదు. ఈ సీజన్​లో ఒక్క టైటిల్​నూ అందుకోలేకపోయింది. ఇండోనేసియా ఓపెన్​లో ఫైనల్​ వరకు వెళ్లి రన్నరప్​గా నిలిచింది. ఐదో స్థానంలో ఉన్న సింధు ఒలింపిక్స్ సమయానికి ఫామ్​ అందుకుని స్వర్ణం సాధిస్తుందని ఆశిస్తున్నారు అభిమానులు.

Women's Day Special: young champions
పివీ సింధు

మనుబాకర్​

విశ్వక్రీడల్లో పతకాలు గెలిచిన రాజ్ వర్ధన్ సింగ్ రాథోర్, అభినవ్ బింద్రా, గగన్ నారంగ్, విజయ్ కుమార్ లాంటి షూటర్ల జాబితాలో మను బాకర్​ చేరాలనుకుంటోంది. ఇప్పటికే ఐఎస్​ఎస్​ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్​లో స్వర్ణం నెగ్గిన పిన్న వయస్కురాలిగా రికార్డు సాధించింది. అంతేకాకుండా 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో జూనియర్, సీనియర్ రెండిట్లోనూ ఛాంపియన్​గా నిలిచింది. ప్రస్తుత ఫామ్​ ప్రకారం చూస్తే ఒలింపిక్స్​లో భారత్​ తరపున పతకాన్ని ఖాయం చేసేలా కనిపిస్తోంది మనుబాకర్.

Women's Day Special: young champions
మనుబాకర్​

వినీశ్ ఫొగాట్

గీత, బబితా తర్వాత ఫొగాట్ కుటుంబం నుంచి వచ్చిన మరో రెజ్లర్ వినేశ్ ఫొగాట్. 25 ఏళ్ల ఈ హరియాణా కుస్తీ క్రీడాకారిణి ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్​షిప్​లో కాంస్యం సాధించి.. టోక్యో ఒలింపిక్స్​కు అర్హత సాధించింది. ఈ ఏడాది వరుసగా మూడు స్వర్ణాలు నెగ్గింది వినీశ్. ఆసియన్, యాసర్ డోగు ఇంటర్నేషనల్, పొలాండ్ ఓపెన్​ల్లో పసిడి పతకాలు చేజిక్కించుకుంది.

Women's Day Special: young champions
వినీశ్​ ఫొగాట్​

ఇదీ చూడండి.. 'భారత పర్యటనతో​ మాకెలాంటి ఇబ్బంది లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.