ETV Bharat / sports

బోల్ట్‌కు‌ కరోనా పాజిటివ్.. ఆ వేడుకే కొంపముంచిందా..?

జమైకా దిగ్గజ స్ప్రింటర్​ ఉసేన్​ బోల్ట్​ స్వీయ నిర్బంధంలోకి వెళ్లాడు. అతడికి కరోనా పాజిటివ్​ రావడమే ఇందుకు కారణంగా తెలిసింది. ఇటీవలే తన పుట్టినరోజు వేడుకలో అతిథులెవ్వరూ మాస్కులు ధరించకుండా పాల్గొనడమే బోల్ట్​ కొంపముంచిందని సన్నిహితులు భావిస్తున్నారు.

author img

By

Published : Aug 25, 2020, 1:09 PM IST

Usain Bolt tests positive for COVID-19, quarantines himself
బోల్ట్‌కు‌ కరోనా పాజిటివ్.. ఆ వేడుకే కొంపముంచిందా..?

జమైకా చిరుత ఉసేన్‌ బోల్ట్‌ కరోనా వైరస్‌ బారిన పడ్డాడు. అతడికి కొవిడ్‌-19 సోకిన విషయాన్ని జమైకా ఆరోగ్యశాఖ నిర్ధారించింది. జమైకాలోని తన ఇంట్లో స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు బోల్ట్​ సామాజిక మాధ్యమాల్లో వీడియో ప్రకటన విడుదల చేశాడు.

అందరూ కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ క్షేమంగా ఉండాలని అందులో కోరాడు. ఎనిమిది సార్లు ఒలింపిక్‌ స్వర్ణపతక విజేత అయిన బోల్ట్‌.. ఇటీవల జరుపుకొన్న 34వ జన్మదిన వేడుకల్లో మాస్క్‌ ధరించకపోవటమే కొంపముంచిందని భావిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.