ETV Bharat / sports

యూఎస్‌ ఓపెన్‌ విజేతగా అల్కరాజ్‌.. నెం.1 ర్యాంకు కైవసం.. నాదల్ రికార్డు సమం

స్పెయిన్ యువ సంచలనం అల్కరాజ్‌ యూఎస్ ఓపెన్ విజేతగా నిలిచాడు. హోరాహోరీగా సాగిన పోరులో సంచలన విజయం సాధించాడు. ఈ గెలుపుతో దిగ్గజ నాదల్ రికార్డును సమం చేశాడు.

US OPEN 2022
US OPEN 2022
author img

By

Published : Sep 12, 2022, 7:04 AM IST

కప్పు సాధిస్తారన్న ఆటగాళ్లు వెనుదిరిగిన యూఎస్‌ ఓపెన్‌లో అనూహ్యంగా టైటిల్‌ బరిలో నిలిచి హోరాహోరీగా తలపడ్డారు ఇద్దరు యువ క్రీడాకారులు. ఇద్దరికీ ఇదే తొలి యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌. అయినప్పటికీ ఒత్తిడిని చిత్తుచేస్తూ నువ్వానేనా అన్నట్లు పోటీ పడ్డారు. అయితే చివరికి విజయం స్పెయిన్‌ యువ సంచలనం, 19 ఏళ్ల కుర్రాడు అల్కరాజ్‌నే వరించింది. దాదాపు మూడున్నర గంటలపాటు సాగిన హోరాహోరీ పోరులో 6-4, 2-6, 7-6(7-1), 6-3 తేడాతో గెలుపొందాడు.

US OPEN 2022
.

దీంతో పాటు అతడు ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. స్పెయిన్‌కే చెందిన దిగ్గజ ఆటగాడు రఫేల్‌ నాదల్‌ 2005లో అతిపిన్న (19 ఏళ్లు) వయసు ఆటగాడిగా తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సాధించాడు. అప్పటి నుంచి ఆ రికార్డును ఎవరూ బద్దలుకొట్టలేదు. తాజాగా అల్కరాజ్‌ ఆ రికార్డును సమం చేయడంతో పాటు 19 ఏళ్ల వయసులోనే ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌ను సొంతం చేసుకున్న తొలి ఆటగాడిగా అల్కరాజ్‌ నిలిచాడు.

.

హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో విజయం కోసం ఇద్దరూ తీవ్ర కృషి చేశారు. ఎక్కడా ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా తలపడ్డారు. ఈ క్రమంలో అల్కరాజ్‌ 6-4తేడాతో తొలిసెట్‌ను గెలుచుకున్నాడు. అయితే రెండోసెట్‌లో రూడ్‌ విజృంభించాడు. ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్‌ చేసి 4-2తో అధిక్యంలో నిలిచాడు. అదే ఊపులో 6-2 తేడాతో ఆ సెట్‌ను కైవసం చేసుకొని సమంగా నిలిచాడు. ఇక మూడో సెట్‌లో విజయం కోసం కఠోర శ్రమ చేశారు ఇద్దరు. తొలుత ఆధిక్యంలోకి రూడ్‌ దూసుకువెళ్లగా, అనంతరం అల్కరాజ్‌ ఒత్తిడిని అధిగమించి స్కోర్‌ను సమం(6-6) చేయడంతో ఈ సెట్‌ టైబ్రేకర్‌కు మళ్లింది. ఇందులో 7-1 (7-6) తేడాతో అల్కరాజ్‌ నెగ్గాడు. ఇక కీలకమైన నాలుగు సెట్‌లో రూడ్‌ చెతులెత్తేశాడు. అల్కరాజ్‌ తన ఆధిక్యాన్ని నిలుపుకుంటూ 6-3 తేడాతో తొలిసారి యూఎస్‌ కిరీటంతో పాటు, ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంకును తన సొంతం చేసుకున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.