టోక్యో పారాలింపిక్స్‌లో రజతం సాధించిన మరియప్పన్ తంగవేలుకు తమిళనాడు ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది. టీఎన్‌పీఎల్‌లో సేల్స్ విభాగంలో ఆయన్ను డిప్యూటీ మేనేజర్‌గా నియమించి గౌరవించింది. ఈ మేరకు సీఎం ఎంకే స్టాలిన్ తన కార్యాలయంలో మరియప్పన్‌కు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ ఫొటోను తన ట్విటర్‌లో షేర్ చేశారు. ఇది గుర్తింపు కోసం ఇస్తున్న ఉద్యోగం కాదనీ.. ఏదో సాధించాలన్న తపనతో ఎదురుచూస్తున్నవారికి ప్రభుత్వం కల్పిస్తోన్న ప్రోత్సాహమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
ఈ ఏడాది టోక్యో ఒలింపిక్స్, పారాలింపిక్స్‌లో మన దేశ క్రీడాకారులు అసమాన ప్రతిభకనబరిచి పతకాలు సాధించి గర్వకారణంగా నిలిచారు. పారాలింపిక్స్‌లో పురుషుల హైజంప్ టీ-42 ఈవెంట్‌లో మరియప్పన్ తంగవేలు రజతంతో మెరిసిన విషయం తెలిసిందే. రజతం సాధించి తమిళనాడు కీర్తిని చాటిన మరియప్పన్ తంగవేలుకు ఉద్యోగం ఇస్తామని తమిళనాడు సీఎం స్టాలిన్ హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా బుధవారం మరియప్పన్‌కు ఉద్యోగ నియామక పత్రం అందించి తన హామీని నిలబెట్టుకున్నారు.
ఇదీ చదవండి: