ETV Bharat / sports

ఒలింపిక్స్ కోసం సోషల్ మీడియాకు దూరమైన రెజ్లర్ - టోక్యో ఒలింపిక్స్

టోక్యో ఒలింపిక్స్​ను దృష్టిలో ఉంచుకుని సామాజిక మాధ్యమాల నుంచి తాత్కాలిక విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించాడు భారత రెజ్లర్​ భజరంగ్​ పూనియా. ఒలింపిక్స్ అనంతరం వాటిలోకి రీఎంట్రీ ఇస్తానని అన్నాడు.

Shutting my social media handle till Olympics: Bajrang
'అందుకే సోషల్​ మీడియాను వదిలేస్తున్న'
author img

By

Published : Mar 1, 2021, 2:28 PM IST

అన్ని సామాజిక మాధ్యమాలకు కొంత కాలం దూరంగా ఉండనున్నట్లు భారత రెజ్లర్ భజరంగ్​ పూనియా ప్రకటించాడు. టోక్యో ఒలింపిక్స్​పై పూర్తి స్థాయిలో దృష్టి సారించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. ఒలింపిక్స్​ అనంతరం సోషల్​ మీడియాలోకి మళ్లీ వస్తానని స్పష్టం చేశాడు.

"నా సామాజిక మాధ్యమాల ఖాతాలన్నింటిని ఈ రోజు నుంచి నిలిపివేస్తున్నాను. పోటీల​ అనంతరం తిరిగి మిమ్మల్ని కలుస్తాను. అప్పటివరకు నాపై అదే ప్రేమ కురిపిస్తారని ఆశిస్తున్నాను. జై హింద్"​ అని భజరంగ్​ ట్వీట్​ చేశాడు.

  • Mein apne sabhi social media handles ko aaj se band kar raha hu. Ab Olympic ke baad aap sabhi se mulaakaat hogi ... ummeed karta hu aap apna pyaar banaye rakhenge ..... jai Hind 🙏🏽 pic.twitter.com/wCKXuT4gj9

    — Bajrang Punia 🇮🇳 (@BajrangPunia) March 1, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

2019 ప్రపంచ ఛాంపియన్​షిప్​లో రజత పతకం గెల్చుకున్న భజ్​రంగ్.. టోక్యో ఒలింపిక్స్​కు అర్హత సాధించాడు. అతడు 65 కిలోల విభాగంలో బరిలోకి దిగనున్నాడు. దిల్లీ వేదికగా గతేడాది ఫిబ్రవరిలో జరిగిన ఆసియా సీనియర్​ ఛాంపియన్​షిప్స్​లో భజరంగ్​ చివరిసారిగా పాల్గొన్నాడు. ​'మార్చిలో జరిగే రోమ్​ ర్యాంకింగ్ సిరీస్​, ఆసియా​ ఛాంపియన్​షిప్స్​లోనూ బరిలోకి దిగుతాను' అని​ వెల్లడించాడు.

దేశం గర్వించే ప్రదర్శన చేస్తారు..

రాబోయే ఒలింపిక్స్​లో భారత బృందంపై ఆశాజనకంగా స్పందించారు కేంద్ర క్రీడల మంత్రి కిరణ్​ రిజిజు. దేశం గర్వించే ప్రదర్శన చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. 'కొవిడ్ కారణంగా ఒలింపిక్స్​ ఓ ఏడాది వాయిదా పడ్డాయి. అయితే తేదీల్లో మాత్రం మార్పు లేదు' అని మంత్రి పేర్కొన్నారు.

అథ్లెట్లకు టీకా పంపిణీ ఎప్పుడు అన్న ప్రశ్నపై స్పందించిన​ రిజిజు.. "ప్రస్తుతం కరోనా వారియర్స్​కు వ్యాక్సినేషన్​ కార్యక్రమం జరుగుతోంది. ఆటగాళ్లకు టీకా పంపిణీ గురించి కేంద్ర ఆరోగ్య మంత్రిని సంప్రదించాం. వారి నుంచి అనుమతులు రాగానే అథ్లెట్లకు వ్యాక్సిన్​ ఇస్తాం" అని తెలిపారు.

ఇదీ చదవండి: 'ఒలింపిక్స్​ ఆటగాళ్లకు త్వరలోనే కొవిడ్ టీకా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.