ETV Bharat / sports

సుశీల్ కస్టడీ మరో 4 రోజులు పొడిగింపు

author img

By

Published : May 29, 2021, 5:19 PM IST

Updated : May 29, 2021, 5:49 PM IST

భారత రెజ్లర్​ సుశీల్​ కుమార్​కు మరో నాలుగు రోజుల పాటు పోలీస్​ కస్టడీని పొడిగించింది దిల్లీ కోర్టు. ఏడు రోజుల రిమాండ్​ కావాలని కోరగా.. అందుకు న్యాయస్థానం నిరాకరించింది.

sushil kumar, indian wrestler
సుశీల్ కుమార్, భారత రెజ్లర్

భారత ప్రముఖ రెజ్లర్​ సుశీల్ కుమార్​తో పాటు అతని అనుచరుడు అజయ్​ పోలీస్ కస్టడీని మరో నాలుగు రోజులు పెంచుతూ దిల్లీ కోర్టు అనుమతిచ్చింది. తొలుత మే 23న ఆరు రోజుల రిమాండ్​కు అంగీకరించింది న్యాయస్థానం. అనంతరం సుశీల్​ను కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు.

ప్రతి 24 గంటలకు ఒకసారి సుశీల్​కు వైద్యపరీక్షలు నిర్వహించాలని పోలీసులను ఆదేశించింది న్యాయస్థానం. రిమాండ్​ సమయంలో సుశీల్​ న్యాయవాది అతన్ని కలిసేందుకు అనుమతినిచ్చింది. సుశీల్​తో పాటు అజయ్​ను విచారించడానికి మరో 7 రోజులు కావాలని పోలీసులు దిల్లీ కోర్టును కోరారు. అందుకు నిరాకరించింది న్యాయస్థానం.

సుశీలే ప్రధాన సూత్రధారి..

సాగర్ రానా హత్య కేసులో రెజ్లర్ సుశీల్​ కుమారే ప్రధాన సూత్రధారి అని ప్రాసిక్యూషన్ కోర్టుకు వెల్లడించింది. "యువ రెజ్లర్ హత్య కేసులో సుశీలే ప్రధాన సూత్రధారి. అతడే ప్రధాన నిందితుడు. గత ఆరు రోజులుగా కస్టడీలో ఉన్న సుశీల్, అజయ్​.. పోలీసులకు సహకరించట్లేదు. పైగా వారిని చాలా ఇబ్బంది పెట్టారు. అందుకే మరోసారి కస్టడీని కోరాల్సి వచ్చింది" అని తెలిపింది.

"గొడవ సమయంలో తాను అక్కడే ఉన్నట్లు, తర్వాత అక్కడి నుంచి ఇంటికి వెళ్లి పడుకున్నట్లు సుశీల్​ విచారణలో ఒప్పుకొన్నాడు. అతని నుంచి లైసెన్స్​ ఉన్న ఓ పిస్టోల్​ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ హత్య కేసులో మొత్తం 18-20 నుంచి పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటికీ కేవలం 8 మందిని మాత్రమే అరెస్టు చేశారు" అని కోర్టుకు వాదనలు వినిపించారు. సుశీల్​ నుంచి మరికొంత సమాచారం కోసం ఏడు రోజుల రిమాండ్​ కావాలని పోలీసులు కోరారు. కానీ అందుకు న్యాయస్థానం తిరస్కరించింది.

ఇదీ చదవండి: Sushil Kumar: గ్యాంగ్‌స్టర్లతో సంబంధాలపై మౌనం

Last Updated : May 29, 2021, 5:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.