భారత దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్(Milkha Singh) ఆక్సిజన్ స్థాయిలు ఆందోళనకరంగా పడిపోయాయి. కొవిడ్ నెగెటివ్ రిపోర్ట్ అనంతరం ఆయనను జనరల్ వార్డుకు మార్చారు. అనంతరం ఆయనకు తీవ్ర జ్వరం వచ్చింది. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు.
"గురువారం రాత్రి మిల్కా సింగ్‌కు అకస్మాతుగా జ్వరంతో పాటు ఆక్సిజన్ స్థాయిలు ఒక్కసారిగా పడిపోయాయి. వైద్య బృందం అతని పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. ఈ రోజు ఆయనకు చాలా కఠినమైన రోజు. కానీ, ఆయన పోరాడుతున్నారు" అని పీజీఐఎంఈఆర్ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. అంతకు ముందు ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
మిల్కా సింగ్ గత నెలలో కొవిడ్ బారిన పడ్డారు. తొలుత మొహాలీలోని ఫోర్టిస్ ఆస్పత్రి (Forties Hospital)లో చికిత్స పొందారు. తర్వాత డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లిన ఆయనను.. ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడం వల్ల చండీగఢ్‌లోని పీజీఐఎంఈఆర్ ఆస్పత్రిలో చేర్చారు కుటుంబ సభ్యులు. మిల్కా సింగ్ భార్య నిర్మలా కౌర్(Nirmala Kaur) కూడా కరోనా బారిన పడింది. ఆమె గత ఆదివారం మహమ్మారితో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు.
ఇదీ చదవండి: