ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ ప్రభావం భారత్‌పైనా కనిపిస్తోంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో క్రీడా టోర్నీలను పూర్తిగా రద్దు చేయగా.. మరికొన్ని దేశాల్లో ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్‌లను నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ క్రమంలో భారత్‌లో జరగాల్సిన కొన్ని క్రీడా టోర్నీలను రద్దు చేయగా.. మరికొన్ని వాయిదా పడ్డాయి.
వ్యాయామ క్రీడలు
- మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ వేదికగా ఏప్రిల్ 6-8 తేదీల్లో జరగబోయే ఫెడరేషన్ కప్ జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ వాయిదా పడింది.
బ్యాడ్మింటన్
- దిల్లీలో మార్చి 24 నుంచి 29 వరకు జరగనున్న ఇండియా ఓపెన్.. ప్రేక్షకులు లేకుండానే నిర్వహించనున్నారు.
బాస్కెట్‌బాల్
- బెంగళూరు వేదికగా మార్చి 18 నుంచి 22 వరకు నిర్వహించనున్న అంతర్జాతీయ బాస్కెట్‌బాల్ సమాఖ్య నిర్వహించే ఒలింపిక్ అర్హత టోర్నమెంట్ వాయిదా పడింది.
క్రికెట్
- ప్రభుత్వం విధించిన వీసా ఆంక్షల కారణంగా ఏప్రిల్ 15 వరకు ఐపీఎల్‌కు విదేశీ ఆటగాళ్లు దూరంగా ఉండనున్నారు.
- టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య ఈనెల 15,18 తేదీల్లో లఖ్‌నవూ, కోల్‌కతాలో వన్డే సిరీస్ ప్రేక్షకులు లేకుండా జరగనుంది.
- రంజీట్రోఫీ ఫైనల్ చివరిరోజు ప్రేక్షకులు లేకుండా ఆట సాగనుంది.
- ముంబయి, పుణెలలో ఈనెల 22 వరకు జరగనున్న 'రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్' రద్దు చేశారు.
ఫుట్‌బాల్
- ఏటీకె ఫుట్‌బాల్ క్లబ్, చెన్నయిన్ ఫుట్‌బాల్ క్లబ్ మధ్య ఇండియన్ సూపర్ లీగ్ ఫైనల్ గోవాలో ఈనెల 14న జరగనుంది. ప్రేక్షకులు లేకుండానే ఈ మ్యాచ్ జరగనుంది.
- ఈనెల 26న భువనేశ్వర్‌లో భారత్, ఖతార్ మధ్య జరగాల్సిన ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయర్ మ్యాచ్ వాయిదా పడింది.
- జూన్ 9న కోల్‌కతా వేదికగా భారత్, అఫ్గానిస్థాన్ మధ్య జరగనున్న ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయర్ మ్యాచ్ వాయిదా పడింది.
- ఏప్రిల్ 14 నుంచి 27 వరకు మిజోరాంలో జరగనున్న సంతోష్ ట్రోఫీ తుది రౌండ్ మ్యాచ్‌లు వాయిదా పడ్డాయి.
- ఐ-లీగ్‌లోని 28 మ్యాచ్‌లు ఖాళీ స్టేడియాల్లో జరగనున్నాయి.
గోల్ఫ్
- ఈ నెల 19 నుంచి 22 వరకు హర్యానా వేదికగా జరగనున్న ఇండియా ఓపెన్ గోల్ఫ్ టోర్నీ వాయిదా పడింది.
పారాస్పోర్ట్స్
- పారా క్రీడలకు సంబంధించిన అన్ని జాతీయ, రాష్ట్ర ఛాంపియన్‌షిప్ టోర్నీలు ఏప్రిల్ 15 వరకు వాయిదా పడ్డాయి.
షూటింగ్
- ఈనెల 15 నుంచి 25 వరకు జరగనున్న రైఫిల్, పిస్టల్, షార్ట్‌గన్ ప్రపంచకప్ పోటీలను వాయిదా వేశారు.
టెన్నిస్
- భారత్‌లో జరగనున్న దేశవాళీ టెన్నిస్ టోర్నీలన్నీ రద్దు చేశారు.
ఇదీ చూడండి.. అలా చేస్తే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేం!