ఏడాదికి పైగా విరామం తర్వాత భారత స్టార్ అథ్లెట్ హిమదాస్ మెరిసింది. ఇండియన్ గ్రాండ్‌ప్రి-2 టోర్నీలో ఆమె 200 మీటర్ల పరుగులో స్వర్ణం గెలుచుకుంది. ఈ రేసులో హిమ 23.31 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచింది.
స్ప్రింటర్ ద్యుతిచంద్ మరోసారి సత్తా చాటింది. 100 మీటర్ల పరుగులో ఆమె 11.44 సెకన్లలో లక్ష్యాన్ని చేరి పసిడి గెలిచింది. చివరిగా ద్యుతి 2019 ఆగస్టులో పోటీపడింది. గాయం.. ఆ తర్వాత కరోనా మహమ్మారి కారణంగా చాలా కాలం ట్రాక్‌కు దూరమైంది.
భారత్‌కు స్వర్ణం ఖాయం
పారా ఆర్చరీ ప్రపంచ ర్యాంకింగ్ టోర్నమెంట్లో భారత్‌కు స్వర్ణం ఖాయమైంది. పురుషుల కాంపౌండ్ సింగిల్స్ విభాగంలో భారతీయులు రాకేశ్ కుమార్, శ్యామ్ సుందర్ స్వామి ఫైనల్లో అడుగుపెట్టారు. గురువారం జరిగిన సెమీస్‌లో రాకేశ్ 143-138తో అగాన్ (టర్కీ)ని ఓడించగా, స్వామి 145-143తో డిఫెండింగ్ ఛాంపియన్ మార్సెల్ (స్లోవెకియా)ని కంగుతినిపించాడు.
ఇదీ చూడండి: జాతీయ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌గా సత్యన్