దుబాయ్ వేదికగా జరుగుతోన్న ఆసియా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లోని పురుషుల విభాగంలో భారత్‌కు తొలి స్వర్ణం దక్కింది. సోమవారం జరిగిన ఫైనల్లో కజెకిస్థాన్కు చెందిన వాసిలీ లెవిట్‌పై భారత బాక్సర్ సంజీత్(91 కిలోలు) 4-1 తేడాతో గెలుపొంది.. పసిడి పతకాన్ని సాధించాడు.
టోర్నీలో అంతకుముందు జరిగిన ఫైనల్స్‌లో ఓడిన భారత బాక్సర్లు అమిత్ పంగాల్(52 కిలోలు), శివ థాపా (64 కిలోలు) రజతం పతకాన్ని అందుకున్నారు.
ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్ ప్రస్తుత ఎడిషన్‌లో భారత్ 15 పతకాలతో మెరుగయ్యింది. 2019లో జరిగిన ఛాంపియన్‌షిప్‌లో రెండు స్వర్ణాలతో పాటు 13 పతకాలను సాధించింది. ఈ సారి కూడా రెండు గోల్డ్ మెడల్స్‌ను సొంతం చేసుకుంది.
ఇదీ చూడండి: ఆసియా ఛాంపియన్షిప్: అమిత్ పంగాల్‌కు రజతం