ETV Bharat / sports

ప్రాక్టీస్‌కు వెళ్లలేకపోతున్నా.. భారత్​ మాకు చాలా సాయం చేసింది: లంక క్రికెటర్​ భావోద్వేగం - sri lanka cricket chamika karunaratne

సంక్షోభం కారణంగా శ్రీలంకలో క్రికెటర్లు అవస్థలు పడుతున్నారు. ఇంధన కొరత వల్ల.. ఆటపై దృష్టి పెట్టలేకపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశాడు ఆ దేశ యువ ఆటగాడు చమిక కరుణరత్నే. సంక్షోభం సమయంలో తమ దేశానికి సాయం చేసిన భారత్​కు ధన్యవాదాలు తెలిపాడు కరుణరత్నే.

"Can't Even Go To Practice": Sri Lanka Cricketer On Massive Fuel Crisis
ఇంధన కొరతతో.. ప్రాక్టీస్‌కు వెళ్లలేకపోతున్నా: లంక క్రికెటర్‌ ఆవేదన
author img

By

Published : Jul 16, 2022, 5:10 PM IST

శ్రీలంక సంక్షోభ పరిస్థితుల కారణంగా ఆ దేశ క్రికెటర్లు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు రోజులపాటు క్యూలైన్లలో ఉంటేనే తన కారుకు పెట్రోల్‌ కొట్టించుకోగలిగానని యువ ఆటగాడు చమిక కరుణరత్నే పేర్కొన్నాడు. దీంతో క్రికెట్‌ ప్రాక్టీస్‌కు కూడా వెళ్లలేకపోతున్నానని వాపోయాడు. ఓ ఛానల్‌తో చమిక మాట్లాడుతూ.. ''రెండు రోజుల నుంచి పెట్రోల్‌ కోసం వేచి ఉంటే ఇవాళ దొరికింది. భారీస్థాయిలో ఇంధన కొరత ఉండటంతో ప్రాక్టీస్‌కు కూడా వెళ్లలేకపోతున్నా'' అని చెప్పాడు. ప్రస్తుత సంక్షోభంలో శ్రీలంకకు భారత్‌ ఎంతో సాయంగా నిలిచిందని, తమకు సోదర దేశమని వ్యాఖ్యానించాడు.

ఓ వైపు శ్రీలంకలో సంక్షోభం కొనసాగుతున్నా.. ఇటీవలే ఆసీస్‌ జట్టు ఇక్కడ పర్యటించింది. ఇప్పుడు లంకతో పాకిస్థాన్‌ టెస్టు సిరీస్‌ ఆడుతోంది. వచ్చే నెలలో ఆసియా కప్‌ పోటీలకు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే ఆసియా కప్‌ నిర్వహణపై ఇప్పుడేమీ మాట్లాడలేనని, ఏం జరుగుతుందో వేచి చూడాలని చమిక పేర్కొన్నాడు. ''ఈ ఏడాది షెడ్యూల్‌ ప్రకారం ఆసియా కప్‌తోపాటు లంక ప్రీమియర్‌ లీగ్​లు (ఎల్‌పీఎల్‌) ఉన్నాయి.

  • #WATCH | Sri Lankan cricketer Chamika Karunaratne speaks to ANI; says, "We've to go for practices in Colombo&to different other places as club cricket season is on but I've been standing in queue for fuel for past 2 days. I got it filled for Rs 10,000 which will last 2-3 days..." pic.twitter.com/MkLyPQSNbZ

    — ANI (@ANI) July 16, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

''ఏం జరుగుతుందో నాకైతే అర్థం కావడం లేదు. నేను ప్రాక్టీస్‌ కోసం కొలొంబోలోని వేర్వేరు ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంది. అయితే.. ఇంధన కొరత వల్ల ప్రాక్టీస్‌కూ వెళ్లడం లేదు. గత రెండు రోజులుగా బయటకే వెళ్లలేకపోయా. ఎందుకంటే పెట్రోల్‌ కోసం భారీ క్యూలైన్లలోనే ఉండిపోయా. అదృష్టవశాత్తూ ఇవాళ పెట్రోల్‌ దొరికింది. అదీనూ పదివేల రూపాయలు (శ్రీలంక కరెన్సీలో) కొట్టిస్తే ఇంకో రెండు లేదా మూడు రోజులు మాత్రమే వస్తుంది. అయితే.. సంక్షోభం తొలగిపోయి ఆసియా కప్‌నకు శ్రీలంక ఆతిథ్యం ఇస్తుందనే నమ్మకం ఉంది. ఇంధన కొరత కూడా తీరిపోతుందని ఆశిస్తున్నా. మా క్రికెట్‌ బోర్డు కూడా సిద్ధంగానే ఉంది. ఇప్పటికే ఆసీస్‌తో సిరీస్‌లు ఆడాం. మంచి స్పందనే వచ్చింది'' అని చమిక వివరించాడు. శ్రీలంకలో సంక్షోభం గురించి ఎక్కువగా మాట్లాడనని, అయితే త్వరలోనే సరైన వ్యక్తులు వచ్చి పరిస్థితిని చక్కదిద్దుతారని మాత్రం చెప్పగలనని అతడు పేర్కొన్నాడు.

ఇదీ చదవండి: ఫైనల్లో పీవీ సింధు.. జపాన్​ షట్లర్​ను చిత్తుచిత్తుగా ఓడించి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.