ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత రన్నర్ అవినాశ్ సేబల్ నిరాశపరిచాడు. శుక్రవారం జరిగిన 3000 మీటర్ల స్టీపుల్ ఛేజ్ ఫైనల్లో 13వ స్థానంలో నిలిచాడు. అయినప్పటికీ జాతీయ రికార్డు సాధించాడు. ఆపై టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. తన జాతీయ రికార్డు తానే బద్దలుకొట్టడం ఈ అథ్లెట్కిది రెండోసారి.
ఈ రేసును 8:21.37 నిమిషాల్లో పూర్తి చేసిన అవినాశ్.. ఒలింపిక్ అర్హత సమయం 8:22 నిమిషాల కంటే ముందున్నాడు. అదే విధంగా తన పేరిట ఉన్న జాతీయ రికార్డును (8:25 నిమిషాలు) అధిగమించాడు. ఈ పోటీలో కిప్రుటో (8:01.35; కెన్యా) స్వర్ణం సాధించాడు.
ఇది చదవండి: అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ నుంచి జాన్సన్ ఔట్