ETV Bharat / sports

74 రోజులు విమానాశ్రయంలోనే విదేశీ ఫుట్​బాల్ ప్లేయర్ - footballer Randy Juan Muller news

కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా విధించిన లాక్​డౌన్​తో ఓ విదేశీ ఫుట్​బాల్​ ప్లేయర్​ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఏకంగా 74 రోజులుగా ముంబయి విమానాశ్రయంలో ఉండిపోయాడు. విషయం తెలిసిన అతడికి మహారాష్ట్ర ప్రభుత్వం హోటల్​లో ఆశ్రయం కల్పించింది.

footballer Randy Juan Muller
ఘనా ఫుట్​బాల్​ప్లేయర్​ రాండీ జుయన్​ ముల్లర్​
author img

By

Published : Jun 7, 2020, 1:12 PM IST

ప్రముఖ దర్శకుడు స్టీవెన్​ స్పిల్​బర్గ్​ రూపొందించిన హాలీవుడ్​ చిత్రం 'ద టెర్మినల్​' గుర్తుందా? అందులో ఓ వ్యక్తి అమెరికాలో అడుగుపెట్టేందుకు అనుమతి లేకపోవడం వల్ల విమానాశ్రయంలోనే ఏడాది పాటు ఉండిపోతాడు. తాజాగా అదే రీతిలో ఓ యువ ఫుట్​బాల్​ ప్లేయర్​ 74 రోజులు ఎయిర్​పోర్టులోనే ఉన్నాడు. తాజాగా ఈ విషయం బయటకు రాగా.. వెంటనే స్పందించిన ప్రభుత్వం అతడికి సాయమందించింది. విదేశీ విమాన సర్వీసులు ప్రారంభమయ్యేవరకు అతడు ఓ హోటల్​లో ఆశ్రయం ఉండేలా ఏర్పాట్లు చేసింది.

footballer Randy Juan Muller
రాండీ జుయన్​ ముల్లర్

ఇదీ జరిగింది..

కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ విధించింది కేంద్ర ప్రభుత్వం. మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తక్షణమే దేశీయ, అంతర్జాతీయ విమాన సేవలను నిలిపివేసింది. అయితే ఘనా దేశానికి చెందిన 23 ఏళ్ల ఫుట్​బాల్​ ప్లేయర్​ రాండీ జుయన్​ ముల్లర్​.. కేరళలో ఓ ఫుట్​బాల్​ క్లబ్​ తరఫున ఆడుతున్నాడు. కెన్యా ఎయిర్​వేస్​ విమానంలో స్వదేశానికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుని ముంబయి రాగా.. లాక్​డౌన్​ కారణంగా అక్కడే చిక్కుకుపోయాడు. అప్పటి నుంచి దాదాపు 74 రోజులు ఎయిర్​పోర్టులోనే గడిపాడు. ఈ విషయాన్ని ఓ వ్యక్తి ట్విట్టర్​ వేదికగా మహారాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆదిత్యా థాక్రేకు తెలియజేయగా.. వెంటనే స్పందించారు. అతడికి సాయం చేసేందుకు స్థానిక యువజన నాయకుడు రాహుల్​ కనల్​ను పంపించారు.

footballer Randy Juan Muller
ఫుట్​బాల్​ ప్లేయర్​ రాండీ జుయన్​ ముల్లర్

"పరిసర ప్రాంతంలో ఉన్న ఓ కృత్తిమ గార్డెన్​లో ముల్లర్​ ఉండేవాడు. చిన్నచిన్న స్టాల్స్​ నుంచి ఆహారం కొనుక్కొని తినేవాడు. రోజూ ఎయిర్​పోర్టు సిబ్బందితో మాట్లాడుతూ కాలక్షేపం చేసేవాడు. విషయం తెలియగానే ఎయిర్​పోర్టుకు వెళ్లి కలిసినప్పుడు భావోద్వేగం చెంది ఏడ్చాడు. నిజంగా అన్ని రోజులు ఉన్న ఆ కుర్రాడి ఆత్మస్థైర్యం, పోరాటానికి సలాం" అని కనల్​ తెలిపాడు.

తాజాగా ఆదిత్యా థాక్రేతో పాటు కనల్​కు ధన్యవాదాలు తెలిపాడు ప్లేయర్​ రాండీ. తన ఇంటికి ఫోన్​ చేసుకోడానికి ఓ సెక్యూరిటీ అధికారి ఫోన్​ ఇచ్చినట్లు చెప్పాడు. ఫలితంగా తన క్షేమం గురించి కుటుంబానికి తెలియజేసినట్లు వెల్లడించాడు. ఇన్ని రోజులు ఎయిర్​పోర్టు సిబ్బంది బాగా చూసుకున్నట్లు చెప్పాడు. ప్రభుత్వం విదేశీ ప్రయాణాలకు అనుమతిచ్చేవరకు ఎదురుచూస్తానని పేర్కొన్నాడు. రవాణా సౌకర్యం అందుబాటులోకి రాగానే స్వదేశానికి వెళ్తానని స్పష్టం చేశాడు.

ఘనా ఫుట్​బాల్​ప్లేయర్​ రాండీ జుయన్​ ముల్లర్ వీడియో

ఇదీ చూడండి: ప్లేయర్​ X మోడల్‌ ఫిట్​నెస్​ ఛాలెంజ్​.. గెలుపెవరిది?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.