ETV Bharat / sports

ఫుట్​బాల్​ ఆసియాకప్-2027​కు భారత్ ఆతిథ్యం​! - ఆసియా ఫుట్​బాల్​ సమాఖ్య

2027లో ఫుట్​బాల్ ఆసియాకప్​ను నిర్వహించేందుకు భారత్​తో పాటు మరో నాలుగు దేశాలు పోటీలో ఉన్నాయి. ఈ విషయాన్ని ఆసియా ఫుట్​బాల్ సమాఖ్య వెల్లడించింది.

AFC Asian Cup 2027: India among five bidders to host the tournament
2027లో ఫుట్​బాల్​ ఆసియా కప్​కు హోస్ట్​గా భారత్​!
author img

By

Published : Jul 1, 2020, 2:23 PM IST

Updated : Jul 1, 2020, 3:11 PM IST

2027లో ఫుట్​బాల్​ ఆసియాకప్​ నిర్వహించేందుకు భారత్​తో పాటు మరో నాలుగు దేశాలు పోటీపడుతున్నట్లు ఆసియా ఫుట్​బాల్​ సమాఖ్య (ఏఎఫ్​సీ) వెల్లడించింది. ఈ జాబితాలో భారత్​తో పాటు ఇరాన్​, ఖతార్​, సౌదీ అరేబియా, ఉజ్భెకిస్థాన్ ఉన్నాయి.

"ఈ వేలంలో పాల్గొన్న దేశాలతో ఏఎఫ్​సీ కలిసి పనిచేస్తుంది. 2021లో ఆసియాకప్​కు సంబంధించిన ఆతిథ్యదేశాన్ని త్వరలోనే ప్రకటించనున్నారు"

- షేక్​ సల్మాన్ బిన్​ ఇబ్రహీమ్​ అల్​ కలీఫా, ఏఎఫ్​సీ అధ్యక్షుడు

ఈ టోర్నీ నిర్వహించేందుకు ఐదు దేశాలు పోటీపడుతుండగా.. అందులో రెండింటికి ఇప్పటికే రెండుసార్లు ఆతిథ్యమిచ్చిన అనుభవం ఉంది. ప్రస్తుత ఛాంపియన్​ ఖతార్​.. 1988, 2011లో జరిపింది. ఆసియాకప్ ఫుట్​బాల్​ చరిత్రలో 1968, 1976లో సొంతగడ్డపై రెండుసార్లు కప్​ను గెలుచుకున్న ఏకైక దేశంగా ఇరాన్​ ఘనత సాధించింది.

మూడుసార్లు ఛాంపియన్​గా నిలిచిన సౌదీ అరేబియా.. 2022లో ఏఎఫ్​సీ మహిళా ఆసియాకప్​ను నిర్వహించే హక్కులు పొందిన భారత్​, అండర్​-19 ఛాంపియన్​షిప్​కు ఆతిథ్యమిచ్చిన ఉజ్భెకిస్థాన్.. ఇలా​ అన్ని దేశాలు తొలిసారి ఈ టోర్నీ నిర్వహించేందుకు పోటీ పడుతున్నాయి.

ఇదీ చూడండి... ఇంగ్లాండ్​ చేరిన పాక్​ క్రికెటర్లకు కరోనా నెగటివ్​

Last Updated : Jul 1, 2020, 3:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.