ETV Bharat / sports

World Cup 2023 Bangladesh vs New Zealand : మరోసారి అదరగొట్టిన కివీస్​.. బంగ్లాపై ఘనవిజయం

World Cup 2023 Bangladesh vs New Zealand : వన్డే ప్రపంచకప్‌లో భాగంగా చెన్నై వేదికగా బంగ్లాదేశ్​తో జరిగిన మ్యాచ్​లో 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. 246 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ బ్యాటర్లు ఎక్కడా తడబడకుండా 2 వికెట్లు కొల్పోయి లక్ష్యాన్ని ఛేదించారు. దీంతో ఈ వరల్డ్ కప్​లో న్యూజిలాండ్ హ్యాట్రిక్ విజయాలు సాధించింది.

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 13, 2023, 9:54 PM IST

Updated : Oct 13, 2023, 10:21 PM IST

World Cup 2023 Bangladesh Vs New Zealand

World Cup 2023 Bangladesh vs New Zealand : వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌ హ్యాట్రిక్‌ విజయాలు సాధించింది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 246 పరుగుల లక్ష్యాన్ని కేవలం 42.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి ఛేదించింది. ఇప్పటికే ఇంగ్లాండ్‌, నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచుల్లో వరుస విజయాలు సాధించిన కీవీస్‌ ముచ్చటగా మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. మిచెల్‌ (89*; 69 బంతుల్లో 6×4, 4×6) కేన్‌ విలియమ్సన్‌ (78 రిటైర్డ్‌ హర్ట్‌; 107 బంతుల్లో 8×4, 1×6) చెలరేగిన వేళ.. 246 లక్ష్యం చిన్నబోయింది. కాన్వే (45) ఫర్వాలేదనిపించాడు. బంగ్లా బౌలర్లలో ముష్ఫికర్‌ రెహ్మాన్‌, షకీబ్‌ అల్‌ హసన్‌ తలో వికెట్‌ తీశారు.

246 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ బ్యాటర్లు తొలుత కాస్త ఆచిచూచి ఆడారు. యువ క్రికెటర్ రచీన్ రవీంద్ర 13 బంతుల్లో కేవలం 9 పరుగులే చేసి ముస్తాఫిజర్ బౌలింగ్​లో ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజ్​లోకి వచ్చిన కెప్టెన్ విలియమ్సన్​ ఓపెనర్ కాన్వేతో కలిసి ఇన్సింగ్​కు నిర్మించాడు. నెమ్మదిగా ఆడుతూ మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ క్రమంలో షకీబ్ బౌలింగ్​లో కాన్వే(45) పరుగుల వద్ద ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అప్పటికి కివీస్ స్కోర్ 92 పరుగులే. ఆ తర్వాత మిచెల్​ కలిసి విలియమ్సన్​ భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును విజయపథంవైపు తీసుకెళ్లాడు. గాయం కారణంగా విలియమ్సన్​ 78 వ్యక్తిగత పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్​గా వెనుదిరిగాడు. ఆ తర్వాత గ్లెన్ పిలిప్​తో కలిసి మిచెల్ లక్ష్యాన్ని ఛేదించాడు.

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్​ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. ముష్ఫికర్ రహీమ్‌ (66; 75 బంతుల్లో 6×4, 2×6) అర్ధ శతకంతో రాణించాడు. కెప్టెన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ (40), మెహిదీ హసన్‌ మిరాజ్‌ (30) ఫర్వాలేదనిపించారు. బంగ్లా జట్టులో మిగతావారెవరూ పెద్దగా రాణించలేదు. ఇన్సింగ్​ చివర్లో మహ్మదుల్లా (41*) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ ఆడటం వల్ల బంగ్లా జట్టు గౌరవప్రదమైన స్కోరే చేసింది. కివీస్‌ బౌలర్లలో ఫెర్గుసన్‌ 3 వికెట్లు తీయగా.. ట్రెంట్‌ బౌల్ట్‌, మత్‌ హెన్రీ చెరో 2 వికెట్లు, మిచెల్‌ శాట్నర్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌ తలో వికెట్‌ తీశారు.

ODI World Cup 2023 : కాన్వే, రచిన్ రవీంద్ర అద్భుత సెంచరీలు... ఇంగ్లాండ్‌పై కివీస్​ ఘన విజయం

India vs Pakistan World Cup : మహా సమరానికి మరో 24 గంటలే.. మెగాటోర్నీలో దాయాదిపై 'భారత్'​దే పైచేయి

Virat vs Babar ODI Record :విరాట్ X బాబర్.. వన్డేల్లో ఎవరిది పైచేయి? రికార్డులు ఎలా ఉన్నాయంటే?

Last Updated : Oct 13, 2023, 10:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.