టీమ్ఇండియాతో టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్(WTC Final) కోసం ఆటగాళ్ల జాబితాను మంగళవారం విడుదల చేశాడు న్యూజిలాండ్ క్రికెట్ ప్రధానకోచ్ గ్యారీ స్టీడ్(Gary Stead). భారత్‌తో తుదిపోరుకు ఆడనున్న స్క్వాడ్‌లో 15 మందికి ఎంపిక చేశారు. అయితే గాయాల కారణంగా ఇటీవలే ఇంగ్లాండ్‌తో రెండో టెస్టుకు దూరమైన కేన్ విలియమ్సన్(Kane Williamson), వికెట్ కీపర్ బీజే వాట్లింగ్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండనున్నారు. మ్యాచ్ సమయానికి వీరిద్దరూ అందుబాటులో ఉంటారని కోచ్ గ్యారీ స్టీడ్ వెల్లడించాడు.
"కేన్ విలియమ్సన్, బీజే వాట్లింగ్ గాయాల కారణంగా వారం నుంచి విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రస్తుతం వారిద్దరూ కోలుకుంటున్నారు. టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌కు వీరిద్దరూ ఫిట్‌గా మారి అందుబాటులో ఉంటారని భావిస్తున్నా. ప్రపంచకప్ ఫైనల్లో ఆడడం ప్రత్యేక సందర్భం. సౌథాంప్టన్ వేదికగా టీమ్ఇండియాతో తలపడేందుకు మా ఆటగాళ్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు".
- గ్యారీ స్టీడ్, న్యూజిలాండ్ ప్రధానకోచ్
ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ నెగ్గినా.. టీమ్ఇండియాతో ఆడాలంటే న్యూజిలాండ్ ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాలని గ్యారీ స్టీడ్ అన్నాడు. న్యూజిలాండ్ టీమ్‌లోని 20 మంది ఆటగాళ్లలో ఐదుగుర్ని పక్కనపెట్టి.. 15 మందితో టెస్టు ఛాంపియన్షిప్ టీమ్‌ను ఎంపికచేశారు. టీమ్ నుంచి తప్పుకున్న వారిలో డౌగ్ బేస్వెల్, జాకప్ డఫీ, డారిల్ మిచెల్, రాచిన్ రవీంద్ర, మిచెల్ శాంటర్న్ ఉన్నారు.
న్యూజిలాండ్ స్క్వాడ్:
కేన్ విలియమ్సన్(కెప్టెన్), టామ్ బ్లండెల్, ట్రెంట్ బౌల్ట్, డెవాన్ కాన్వే, కాలిన్ డీ గ్రాండ్‌హోమ్, మ్యాట్ హెన్రీ, కైలీ జెమిసన్, టామ్ లతమ్, హెన్రీ నికోలస్, అజాజ్ పటేల్, టిమ్ సౌథీ, రాస్ టేలర్, నీల్ వాగ్నర్, బీజే వాట్లింగ్, విల్ యంగ్.
ఇదీ చూడండి.. WTC Final: టీమ్ఇండియాకు ఐదుగురు శత్రువులు!