ETV Bharat / sports

'ఆ తప్పులు చేయబోం.. ముగ్గురు స్పిన్నర్లతో ఆడతాం' - భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ గ్యారీ స్టెడ్

గురువారం నుంచి భారత్-న్యూజిలాండ్ టెస్టు సిరీస్(IND vs NZ Test Series) ప్రారంభంకానుంది. తాజాగా ఈ విషయమై స్పందించిన కివీస్ కోచ్ గ్యారీ స్టెడ్ పిచ్ పరిస్థితులను బట్టి జట్టులో మార్పులు చేస్తామని తెలిపాడు. అలాగే పలు విషయాలపై మాట్లాడాడు.

Gary Stead latest news, Gary Stead on IND vs NZ match, గ్యారీ స్టెడ్ లేటెస్ట్ న్యూస్, గ్యారీ స్టెడ్ ముగ్గురు స్పిన్నర్ల వ్యూహం
Gary Stead
author img

By

Published : Nov 23, 2021, 5:10 PM IST

Updated : Nov 23, 2021, 9:19 PM IST

పిచ్‌ పరిస్థితులను బట్టి అవసరమైతే ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నామని న్యూజిలాండ్‌ కోచ్‌ గ్యారీ స్టెడ్‌(Gary Stead news) అన్నాడు. టెస్టు మ్యాచులు జరుగనున్న కాన్పుర్‌, వాంఖడే మైదానాలు వేటికవే ప్రత్యేకమైనవని పేర్కొన్నాడు. నవంబరు 25 (గురువారం) నుంచి న్యూజిలాండ్‌, భారత్‌(IND vs NZ Test Series) జట్ల మధ్య కాన్పుర్‌ వేదికగా తొలి టెస్టు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ గైర్హాజరీతో.. అజింక్యా రహానె కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

"ఇంతకు ముందు భారత పర్యటనకు వచ్చిన విదేశీ జట్లు ఎందుకు విఫలమయ్యాయో మేం పరిశీలించాం. అవే తప్పులను మేం చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. నలుగురు సీమర్లు, ఒక స్పిన్నర్‌తో బరిలోకి దిగితే ఇక్కడి పిచ్‌లపై ప్రభావం చూపలేం. ముగ్గురు స్పిన్నర్లను తుది జట్టులోకి తీసుకుంటే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. తొలి మ్యాచ్‌లో విజయం సాధిస్తే.. మిగతా మ్యాచుల్లో అదే సూత్రాన్ని అనుసరిస్తామని చెప్పడం సరికాదు. పిచ్‌ పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడూ వ్యూహాలను మారుస్తూనే ఉండాలి. టెస్టు క్రికెట్లోని కొన్ని మూల సూత్రాలను పాటిస్తూనే.. మా ఆట తీరులో మార్పులు చేసుకుంటాం."

-గ్యారీ స్టెడ్‌, న్యూజిలాండ్‌ కోచ్‌

కొద్ది కాలంగా విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్న రోహిత్‌ శర్మ, రిషభ్‌ పంత్‌, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీలకు టీమ్ఇండియా యాజమాన్యం ఈ టెస్టు సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చింది. ఇప్పటికే టీ20 సిరీస్​కు దూరమైన కోహ్లీ.. రెండో టెస్టులో బరిలో దిగనున్నాడు. ఈ నేపథ్యంలో పలువురు యువ క్రికెటర్లకు జట్టులో చోటు కల్పించారు. అలాగే రాహుల్​కు గాయమవగా.. ఇతడి స్థానంలో సూర్యకుమార్​కు అవకాశం ఇచ్చారు.

ఇవీ చూడండి: కివీస్​తో టెస్టు సిరీస్​కు రాహుల్ దూరం.. సూర్యకుమార్​కు అవకాశం

Last Updated : Nov 23, 2021, 9:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.