ETV Bharat / sports

కెప్టెన్​గా అందుకే తప్పుకొన్నా : విరాట్ కోహ్లీ - ఆర్​సీబీ

Virat Kohli: టీమ్​ఇండియా కెప్టెన్​గా అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకోవడం సహా ఐపీఎల్​లో బెంగళూరు జట్టు సారథ్య బాధ్యతలను వదిలేసుకున్నాడు కోహ్లీ. దీనిపై అభిమానుల్లో చాలా ఊహాగానాలు వెలువడ్డాయి. వీటిపై 'ది ఆర్​సీబీ పాడ్​కాస్ట్'​లో మాట్లాడుతూ విరాట్ వివరణ ఇచ్చాడు. ఆస్వాదించలేనప్పుడు తాను ఏ పనినీ చేయనని అన్నాడు.

Virat Kohli
విరాట్ కోహ్లీ
author img

By

Published : Feb 24, 2022, 3:39 PM IST

Virat Kohli: తనకు తాను కాస్త వ్యవధిని ఇచ్చుకొని, పనిభారాన్ని చూసుకునేందుకే ఆర్​సీబీ కెప్టెన్సీ వదులుకున్నట్లు విరాట్ కోహ్లీ తెలిపాడు. 2021 సీజన్​ తర్వాత రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు జట్టుకు సారథిగా తప్పుకొంటానని గతేడాది సెప్టెంబర్​లోనే ప్రకటించాడు విరాట్. అంతకుముందే టీమ్​ఇండియా టీ20 పగ్గాలు వదిలేసుకున్న కోహ్లీని.. ఆ తర్వాత వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి బీసీసీఐ తప్పించింది. ఇటీవలే దక్షిణాఫ్రికా పర్యటన అనంతరం టెస్టు సారథిగానూ విరాట్ తప్పుకొన్నాడు. ఈ నేపథ్యంలోనే నాయకుడిగా వైదొలగడంపై 'ది ఆర్​సీబీ పాడ్​కాస్ట్'​లో మాట్లాడాడు.

Virat Kohli
కోహ్లీ

"చేయాల్సిన వాటికన్నా ఎక్కువ విషయాలను అట్టిపెట్టుకునే వ్యక్తిని కాదు. నేను ఇంకా చేయగలనని తెలిసినా.. ఆ పనిని ఆస్వాదించలేకపోతే ఎప్పటికీ చేయను. నా స్థానంలో ఉంటే తప్ప ప్రజలు ఇలాంటి కఠిన నిర్ణయాలను అర్థం చేసుకోలేరు. ఈ నిర్ణయంలో ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు. పనిభారాన్ని సమర్థవంతంగా నిర్వహించుకోవడానికి నాకు సమయం కావాలి. అంతే!"

- విరాట్ కోహ్లీ, ఆర్​సీబీ మాజీ కెప్టెన్

నా జీవితం చాలా సింపుల్..

Virat Kohli
ఆర్​సీబీ మాజీ సారథి

కెప్టెన్సీ వీడ్కోలు నిర్ణయంపై ప్రజల్లో వచ్చిన అనేక ఊహాగానాలకు కోహ్లీ తెరదించాడు. "ఈ నిర్ణయంపై అంతగా ఆలోచించడానికి ఏమీ లేదు. నా జీవితాన్ని సింపుల్​గా పెట్టుకుంటా. నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు.. తీసేసుకున్నా. ప్రకటించా. దీనిని మరో ఏడాది పొడిగించడం వల్ల ఎవరికీ ఏ ఉపయోగమూ లేదు. నా వరకు జీవితమైనా, క్రికెట్ అయినా నాణ్యతే ముఖ్యం. ఎంతకాలం అనేది అనవసరం" అని చెప్పాడు విరాట్.

నేనెప్పుడూ నాలానే ఉన్నా..

Virat Kohli
విరాట్ కోహ్లీ

"కష్టంలో పరిమాణం.. ప్రదర్శనలో నాణ్యత.. ఇదే కీలకం. నాణ్యతను పక్కనపెట్టి ఎక్కువగా ఆడేయాలనుకుంటే తప్పుచేసినట్లే. రోజువారీ జీవితంలో నాలా నేను లేకపోతే.. మైదానంలోనూ ఉండలేను. అప్పుడు చేయాల్సింది చేయలేను. నేను నాలా ఉన్నా కాబట్టే.. ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నాను. ప్రజలూ అందుకే ఇష్టపడతారు." అని కోహ్లీ వివరించాడు.

ఇదీ చూడండి:

'కోహ్లీ.. సూపర్​హ్యూమన్​- ధోనీలో మంచు ప్రవహిస్తుంది'

IND VS WI: 'కోహ్లీ గురించి ఆందోళన పడొద్దు

కోహ్లీ, దాదా గొడవ.. అలా చేయాలని కపిల్​దేవ్​ సూచన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.