Titas Sadhu Bowling : 2023 ఆసియా క్రీడల్లో టీమ్ఇండియా మహిళల జట్టు.. ఫైనల్స్‌లో శ్రీలంక పై అద్భుత విజయాన్ని నమోదు చేసి పసిడిని ముద్దాడింది. ఈ మ్యాచ్‌లో భారత్.. చిన్న టార్గెట్‌ను సైతం కాపాడుకొని 19 పరుగుల తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసింది. అయితే ఇక్కడ మాట్లాడుకోవాల్సింది మాత్రం.. టీమ్ఇండియా మీడియం పేస్ బౌలర్ టిటాస్ సాధు గురించి. ఈ 18 ఏళ్ల అమ్మాయి సోమవారం ఫైనల్స్‌లో టీమ్ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించింది. అసలు ఈ టిటాస్ సాధు ఎవరంటే..
స్పోర్ట్స్ పట్ల ఆసక్తి.. టిటాస్ సాధు.. బంగాల్‌కు చెందిన మాజీ అథ్లెట్ రణదీప్ సాధు కుమార్తె. ఆమెకు చిన్నప్పటినుంచే క్రీడలపై ఆసక్తి ఎక్కువ. స్కూల్ డేస్‌లో స్విమ్మింగ్, స్ర్పింటింగ్లో ఆమె టాప్‌లో ఉండేదట. అయితే టిటాస్ సాధు తండ్రి రణదీప్ బంగాల్ హుగ్లీలో క్రికెట్ అకాడమీ నిర్వహిస్తున్నారు. ఈ క్రికెట్ అకాడమీలో తన తండ్రి రణదీప్‌కు.. టిటాస్ అడపాదడపా సహాయం చేసేది. అలా టిటాస్పై క్రికెట్ ప్రభావం ఏర్పడింది. దీంతో ఓ రోజు వర్షం పడుతుండగా రణదీప్ తన కుమార్తెను బౌలింగ్ చేయమని అడిగాడట. టిటాస్ వెంటనే బంతి అందుకొని వర్షంలోనే బౌలింగ్ చేసి తనకు క్రికెట్ పట్ల ఉన్న ఆసక్తిని చాటుకుందట.
13 ఏళ్లకే తొలి ప్రయత్నం.. టిటాస్ 13 ఏళ్ల వయసులో బంగాల్ స్టేట్ లెవల్ క్రికెట్ జట్టులో స్థానం కోసం ప్రయత్నించింది. కానీ అప్పుడు ఆమె సెలెక్ట్ కాలేదు. అయినప్పటికీ నిరాశ చెందకుండా.. నిరంతరం శ్రమిస్తూ, తన నైపుణ్యాలు మెరుగుపర్చుకొని సెలక్టర్ల దృష్టిని ఆకర్షించింది. ఫలితంగా 16 ఏళ్ల వయసులో సీనియర్ బంగాల్ క్రికెట్ జట్టులో చోటు దక్కించుకుంది.
Titas Sadhu Under 19 2023 t20 World Cup : ఆ తర్వాత టిటాస్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఈ ఏడాది జనవరిలో జరిగిన అండర్ 19 టీ20 ప్రపంచకప్ జట్టులో స్థానం దక్కించుకుంది. ఈ టోర్నీ ఫైనల్లో భారత్ మహిళల జట్టు.. ఇంగ్లాండ్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో సైతం టిటాస్ నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం ఆరు పరుగులిచ్చి.. 2 కీలక వికెట్లు పడగొట్టింది. ఆమె ప్రదర్శనకు గాను ఆ ఫైనల్లో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. ఇక ఈ టోర్నీలో ఆమె 6 వికెట్లతో సత్తా చాటి భారత జాతీయ జట్టుకు ఎంపికైంది.
Titas Sadhu International Debut : సోమవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టిటాస్ అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. ఈ మ్యాచ్‌లో సైతం ఆమె అద్భుత గణాంకాలు నమోదు చేసింది. 4 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 6 పరుగులిచ్చి.. 3 కీలక వికెట్లు పడగొట్టింది. ఇందులో ఓ మెయిడెన్ ఓవర్ కూడా ఉంది. ఇక ఈ ప్రదర్శనతో యావత్ భారత్ దృష్టిని ఆకర్షించిన టిటాస్ సాధు.. తన ఫామ్‌ను ఇలాగే కొనసాగిస్తే భవిష్యత్‌లో టీమ్ఇండియాలో కీలక ప్లేయర్‌గా మారడం ఖాయమని పలువురు క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
-
Becoming Asian Champions fills me with pure joy! These golden moments are etched in my heart! 🇮🇳
— Titas Sadhu (@titas_sadhu) September 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Grateful to be part of this exceptional team. 🙌🏻#teamindia #asiangames2023 pic.twitter.com/5tpNiHwNER
">Becoming Asian Champions fills me with pure joy! These golden moments are etched in my heart! 🇮🇳
— Titas Sadhu (@titas_sadhu) September 25, 2023
Grateful to be part of this exceptional team. 🙌🏻#teamindia #asiangames2023 pic.twitter.com/5tpNiHwNERBecoming Asian Champions fills me with pure joy! These golden moments are etched in my heart! 🇮🇳
— Titas Sadhu (@titas_sadhu) September 25, 2023
Grateful to be part of this exceptional team. 🙌🏻#teamindia #asiangames2023 pic.twitter.com/5tpNiHwNER
-
Silent Strides, loud results! ⚡
— Titas Sadhu (@titas_sadhu) September 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
🎥 - @DelhiCapitals Camp#delhicapitals #bowling #camp pic.twitter.com/KL3LVa7Ypl
">Silent Strides, loud results! ⚡
— Titas Sadhu (@titas_sadhu) September 1, 2023
🎥 - @DelhiCapitals Camp#delhicapitals #bowling #camp pic.twitter.com/KL3LVa7YplSilent Strides, loud results! ⚡
— Titas Sadhu (@titas_sadhu) September 1, 2023
🎥 - @DelhiCapitals Camp#delhicapitals #bowling #camp pic.twitter.com/KL3LVa7Ypl
Ind vs SL Asian Games : అదరగొట్టిన అమ్మాయిలు.. ఫైనల్స్‌లో లంకపై విజయం.. భారత్ ఖాతాలో మరో పసిడి
Asian Games Cricket Gold Medalist : ఫైనల్స్‌లో లంకపై భారత్ జయకేతనం.. ఆ ఘనత సాధించిన తొలి జట్టుగా..