Tilak Varma Tattoo : ఆసియా గేమ్స్‌లో భాగంగా జరిగిన క్రికెట్ సెమీఫైనల్ మ్యాచ్‌లో అర్ధశతకం బాది ఇండియా గెలుపులో కీలక పాత్ర పోషించాడు. అయితే, హాఫ్ సెంచరీ చేసిన తర్వాత అతడు చేసుకున్న సంబరాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. టీ20ల్లో రెండో అర్ధ శతకం బాదిన తిలక్ వర్మ.. తన షర్ట్ విప్పి టాటూను చూపిస్తూ సంబరాలు చేసుకున్నాడు. ఈ విజయాన్ని తన తల్లిదండ్రులు, రోహిత్ శర్మ కూతురికి అంకితం ఇస్తున్నట్లు చెప్పాడు. అతడు తన శరీరంపై తల్లిదండ్రుల ఫొటోతో పాటు తన బెస్ట్ ఫ్రెండ్, భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూతరు సమీరా చిత్రాన్ని టాటూగా వేయించుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో 26 బంతుల్లో 55 పరుగుల తుఫాన్ ఇన్నింగ్స్‌తో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు తిలక్ వర్మ. అనంతరం బాల్‌తోనూ అదరగొట్టాడు. రెండు ఓవర్లు వేసిన తిలక్ వర్మ.. బంగ్లాదేశ్ ఓపెనర్ పర్వేజ్ హోస్సేన్‌ను అవుట్ చేశాడు. ఓ బౌలర్‌గా మారి.. పూర్తి స్థాయి ఆల్‌రౌండర్ కావాలన్నది తన లక్ష్యమని చెప్పాడు. రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ లాంటి ఆల్‌రౌండర్ల నుంచి తాను ఎంతో నేర్చుకున్నాని తెలిపాడు.
-
How to make your parents proud ft. @TilakV9 :face_holding_back_tears::raised_hands:
— Sony Sports Network (@SonySportsNetwk) October 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Step :one:: Score a half-century
Step :two:: Dedicate it to your family with a beautiful portrait
:video_camera: | Watch the video to know the secret behind his celebration and his tattoo :muscle:#SonySportsNetwork #Cheer4India #Hangzhou2022 #Cricket… pic.twitter.com/cd8rp3sqws
">How to make your parents proud ft. @TilakV9 :face_holding_back_tears::raised_hands:
— Sony Sports Network (@SonySportsNetwk) October 6, 2023
Step :one:: Score a half-century
Step :two:: Dedicate it to your family with a beautiful portrait
:video_camera: | Watch the video to know the secret behind his celebration and his tattoo :muscle:#SonySportsNetwork #Cheer4India #Hangzhou2022 #Cricket… pic.twitter.com/cd8rp3sqwsHow to make your parents proud ft. @TilakV9 :face_holding_back_tears::raised_hands:
— Sony Sports Network (@SonySportsNetwk) October 6, 2023
Step :one:: Score a half-century
Step :two:: Dedicate it to your family with a beautiful portrait
:video_camera: | Watch the video to know the secret behind his celebration and his tattoo :muscle:#SonySportsNetwork #Cheer4India #Hangzhou2022 #Cricket… pic.twitter.com/cd8rp3sqws
Asian Games Cricket 2023 : 2023 ఆసియా గేమ్స్‌లో క్రికెట్ సెమీఫైనల్ 1లో బంగ్లాదేశ్‌పై భారత్ తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 97 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని.. భారత్ ఒక వికెట్ కోల్పోయి 9.2 ఓవర్లలోనే ఛేదించింది. తిలక్ వర్మ (55* పరుగులు : 26 బంతుల్లో, 2x4, 6x6) తుఫాన్ ఇన్నింగ్స్‌తో అర్ధ సెంచరీ పూర్తి చేయగా.. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (40* పరుగులు : 26 బంతుల్లో) రాణించాడు. బంగ్లా బౌలర్లలో రిపోన్ మోండల్ (26/1) ఒక వికెట్ దక్కించుకున్నాడు. ఈ విజయంతో భారత్ ఓ పతకం ఖాయం చేసుకుంది. శుక్రవారం జరిగిన రెండో సెమీఫైనల్స్‌లో పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ తలపడ్డాయి. ఇందులో అఫ్గానిస్థాన్ గెలుపొందడం వల్ల.. శనివారం గోల్డ్‌మెడల్ కోసం భారత్ పోటీ పడనుంది.
Pak vs Netherlands : ప్రపంచకప్‌లో పాక్ శుభారంభం.. నెదర్లాండ్స్‌పై గెలుపు
Asian Games Cricket 2023 : తిలక్ అదరహో.. ఫైనల్‌కు టీమ్ఇండియా.. పతకం పక్కా..