ETV Bharat / sports

Tilak Varma Suresh Raina : అచ్చం ఓకేలాగా.. వీరిద్దరి మధ్య ఈ 9 కామన్​ విషయాలు తెలిస్తే సర్​ప్రైజ్​ పక్కా! - సురేశ్ రైనా తిలక్ వర్మ రికార్డ్స్​

Tilak Varma Suresh Raina : ఇంటర్నేషనల్ క్రికెట్​లో అరంగేట్రం చేసి పట్టుమని పదిరోజులైనా అవ్వలేదు.. తన ఆటతీరుతో అందరి దృష్టిని ఆకర్షించాడు తిలక్ వర్మ. వన్డేల్లో మిడిలార్డర్ లోటుతో సతమతమౌతున్న టీమ్ఇండియాకు.. ఓ వరంలా కనిపిస్తున్నాడంటూ పలువురు మాజీలు కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే ఇతడు తన ఆటతీరుతో మిస్టర్ ఐపీఎల్​ సురేశ్​ రైనాను గుర్తుచేస్తున్నాడు. వీరిద్దరి ఆటతీరులో చాలా పోలీకలు ఉన్నాయి.

Tilak Varma Suresh Raina : వీరిద్దరి మధ్య ఈ 9 కామన్​ విషయాలు తెలుసా?

author img

By

Published : Aug 10, 2023, 5:57 PM IST

Tilak Varma Suresh Raina : టీమ్ఇండియా యంగ్​ స్టార్ తిలక్ వర్మ.. మిస్టర్ ఐపీఎల్​ సురేశ్​ రైనాను గుర్తుచేస్తున్నాడు. అటలో దూకుడుతనం, బ్యాటింగ్ శైలి, ఎంపిక చేసుకునే షాట్లు ఇలా చాలా విషయాల్లో తిలక్.. రైనాను ఫాలో అవుతున్నట్లు కనిపిస్తున్నాడు. అలాగే అప్పుడు రైనా కెరీర్ ప్రారంభంలో ​ ఎలా జరిగిందో.. ఇప్పుడు తిలక్ ప్రస్థానం కూడా దాదాపు అలాగే సాగుతోంది. మరి వీరిద్దరి మధ్య ఒకేలా సాగిన అంశాలేంటో చూద్దాం..

  • అప్పుడు రైనా, ఇప్పుడు తిలక్.. ఈ ఇద్దరు ఆటగాళ్లు 20 ఏళ్ల ప్రాయంలోనే టీమ్ఇండియాకు టీ20ల్లో ప్రాతినిధ్యం వహించారు.
  • వీరిద్దరూ వారి కెరీర్​ తొలి మ్యాచ్​లో నాలుగో స్థానంలోనే బ్యాటింగ్​కు దిగారు.
  • మొదటి మ్యాచ్​లో ఈ ఇద్దరు 49 పరుగులు చేసి నాటౌట్​గా నిలిచారు.
  • ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లిద్దరూ మిడిలార్డర్​లో బౌలర్లపై ఎదురుదాడికి దిగేందుకు ఇష్టపడతారు.
  • ఇలా అటాకింగ్ గేమ్​తో రైనా సక్సెస్ అయ్యాడు. మరి తిలక్ ఎలా రాణిస్తాడో చూడాలి.
  • ఇక ఈ ఇద్దరూ తొలి అంతర్జాతీయ టీ20లో రెండు క్యాచ్​లు అందుకున్నారు.
  • టీ20ల్లో మొదటి అర్ధశతకం సాధించిన మ్యాచ్​లో భారత్ ఓడింది.
  • తిలక్, రైనా వీరిద్దరూ.. తొలి రెండు ఐపీఎల్ సీజన్​లలో 300+ పరుగులు చేశారు.
  • ఇక ఐపీఎల్​ ప్లే ఆఫ్స్​లో 300+ స్ట్రైక్ రేట్​తో (కనీసం 40+ పరుగులు చేసిన సందర్భాల్లో) ఆడిన ఘనత వీరిద్దరికే చెందింది.

Tilak Varma Stats : కాగా 2022 లో ముంబయి తరఫున ఐపీఎల్​ అరంగేట్రం చేసిన తిలక్ వర్మ.. రెండు సీజన్​లలోనే జట్టులో కీలకంగా మారాడు. తొలి సీజన్​లో 14 మ్యాచ్​ల్లో 36 సగటున, 131 స్ట్రైక్ రేట్​తో 397 పరుగులు చేశాడు. 2023 ఐపీఎల్​లో మరింత మెరుగైన ఆటతో కేవలం 11 మ్యాచ్​ల్లోనే 42.87 సగటున, 164.11 స్ట్రైక్ రేట్​తో 343 పరుగులు సాధించాడు.

Suresh Raina Records : మరోవైపు సురేశ్ రైనా.. ఐపీఎల్​లో నిలకడగా ఆడుతూ 'మిస్టర్ ఐపీఎల్​'గా పేరొందాడు. ఐపీఎల్​ చరిత్రలో (2008 - 2021) రైనా.. 205 మ్యాచ్​ల్లో 32.51 సగటున, 136.76 స్ట్రైక్ రేట్​తో 5528 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకం, 39 అర్ధశతకాలు ఉన్నాయి.

Ind Vs Wi 3rd T20 : గంభీర్​ రికార్డు బ్రేక్​ చేసిన తిలక్​ వర్మ.. టీమ్​ఇండియా తొలి బౌలర్​గా కుల్​దీప్​!

Tilak Varma International Career : అదరగొడుతున్న తెలుగు కుర్రాడు తిలక్ వర్మ.. వరల్డ్​కప్​లో చోటు పక్కా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.