ETV Bharat / sports

టీ20 ఫార్మాట్​కు బై.. క్లారిటీ ఇచ్చిన రోహిత్​.. ఏం అన్నాడంటే?

author img

By

Published : Jan 9, 2023, 5:51 PM IST

Updated : Jan 9, 2023, 6:04 PM IST

Rohith sharma T20 format
టీ20 ఫార్మాట్​పై క్లారిటీ ఇచ్చిన రోహిత్​

17:31 January 09

టీ20 ఫార్మాట్​ నుంచి తప్పుకోలేదు

హార్దిక్ పాండ్య ఐపీఎల్‌లో కెప్టెన్‌గా అదరగొట్టినప్పటి నుంచి రోహిత్‌ శర్మ, కేఎల్ రాహుల్‌ అందుబాటులో లేనప్పుడు భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇటీవల శ్రీలంకతో ముగిసిన మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు టీమ్‌ఇండియా అతడి సారథ్యంలోనే బరిలోకి దిగింది. ఈ సిరీస్‌ని భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. మరోవైపు ఈ ఫార్మాట్​లో కెప్టెన్​గా హిట్​మ్యాన్​ విఫలమవుతున్న సంగతి తెలిసిందే. సెలక్టర్లు కూడా ఈ ఫార్మాట్​లో అతడిని పక్కన పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే టీ20 కెప్టెన్సీని హార్దిక్ పాండ్యకు అప్పగించాలని మాజీల నుంచి అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గతంలో మాజీ కెప్టెన్ ధోనీ.. విరాట్ కోహ్లీకి నాయకత్వ బాధ్యతలు అప్పగించిన విషయాన్ని గుర్తు చేస్తూ.. రోహిత్‌ కూడా అదే విధానాన్ని అనుసరించాలని సూచిస్తున్నారు.

అయితే తాజాగా ఈ విషయమై రోహిత్​ స్పందించాడు. కెప్టెన్సీ విషయాన్ని ప్రస్తావించకుండా.. తనకు టీ20 ఫార్మాట్ నుంచి తప్పుకునే ఆలోచన ప్రస్తుతానికి లేదని స్పష్టం చేశాడు. ఈ ఫార్మాట్​లో కొనసాగుతానని స్పష్టం చేశాడు. ఐపీఎల్​ తర్వాత ఈ విషయం గురించి ఆలోచిస్తానని పేర్కొన్నాడు. అలానే బుమ్రా ఫిట్​నెస్​పై కూడా మాట్లాడాడు. అతడు ప్రస్తుతం నేషనల్​ క్రికెట్​ అకాడమీ నెట్స్​లో శ్రమిస్తున్నాడని చెప్పాడు. "బ్యాక్​ టు బ్యాక్ మ్యాచ్​లు ఆడటం సాధ్యం కాదు. అన్ని ఫార్మాట్ల ప్లేయర్లకు విశ్రాంతి అవసరం. త్వరలోనే న్యూజిలాండ్​తో మూడు మ్యూచుల టీ20 సిరీస్​ ఉంది. ఐపీఎల్​ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. అయినా టీ20 ఫార్మాట్​ నుంచి తప్పుకునే విషయమై నేనేమి ఆలోచించలేదు" అని హిట్​మ్యాన్ పేర్కొన్నాడు.

ఇదీ చూడండి: IND VS SL: వన్డే సిరీస్​కూ బుమ్రా దూరం.. అతడి విషయంలో బీసీసీఐ ప్లాన్ ఏంటో?

Last Updated : Jan 9, 2023, 6:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.