ETV Bharat / sports

నెట్స్​లో ద్రవిడ్ బౌలింగ్.. స్పిన్​తో మాయాజాలం! - రాహుల్ ద్రవిడ్ న్యూజిలాండ్ తొలి టె్సటు

భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు​(IND vs NZ first test) కాన్పుర్ వేదికగా గురువారం ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ప్రాక్టీస్​లో మునిగిపోయాయి ఇరుజట్లు. కాగా, నెట్స్​లో ప్రాక్టీస్ చేస్తున్న భారత బ్యాటర్లకు తన స్పిన్ బౌలింగ్​తో సవాల్ విసిరాడు కోచ్ రాహుల్ ద్రవిడ్. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Rahul Dravid bowling, Rahul Dravid bowling in nets, ద్రవిడ్ బౌలింగ్, నెట్స్​లో ద్రవిడ్ బౌలింగ్
Rahul Dravi
author img

By

Published : Nov 24, 2021, 5:03 PM IST

Rahul Dravid Bowling in nets: భారత్-న్యూజిలాండ్​ మధ్య జరగబోయే టెస్టు సిరీస్​కు అంతా సిద్ధమైంది. గురువారం కాన్పుర్ వేదికగా ఇరుజట్ల మధ్య తొలి టెస్టు జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రాక్టీస్​లో మునిగిపోయాయి రెండు జట్లు. కొత్త కోచ్ రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో భారత ఆటగాళ్లు నెట్స్​లో చెమటోడుస్తున్నారు. ఈ క్రమంలోనే నెట్స్​లో బ్యాటింగ్ చేస్తున్న బ్యాటర్లకు తన స్పిన్ బౌలింగ్​తో సవాల్ విసిరాడు ద్రవిడ్. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ సామాజిక మాధ్యమాల్లో విడుదల చేయగా.. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఈ మ్యాచ్​(IND vs NZ first test)కు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, పంత్, షమీ, బుమ్రాలకు విశ్రాంతినిచ్చింది యాజమాన్యం. కేఎల్ రాహుల్ గాయంతో సిరీస్ నుంచి వైదొలిగాడు. దీంతో తొలి టెస్టుకు అజింక్యా రహానె కెప్టెన్​గా వ్యవహరించనుండగా.. పుజారా వైస్ కెప్టెన్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. స్టార్ ఆటగాళ్లు లేకపోవడం వల్ల మయాంక్ అగర్వాల్, గిల్, శ్రేయస్ అయ్యర్​ల బ్యాటింగ్​పై అందరి దృష్టి నెలకొంది.

ఇవీ చూడండి: శ్రేయస్ టెస్టు అరంగేట్రం ఖరారు.. రహానె క్లారిటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.