ETV Bharat / sports

ధోనీ న్యూ లుక్​.. సోషల్ మీడియా షేక్.. ఫొటో అదిరిపోయిందిగా! - ధోనీ వార్తలు

సోషల్​మీడియాలో ఎక్కువ యాక్టివ్​గా ఉండని టీమ్​ఇండియా మాజీ సారధి ఎంఎస్​ ధోనీకి సంబంధించిన ఓ ఫొటో ప్రస్తుతం వైరల్​గా మారింది. మిస్టర్​ కూల్​ స్టైల్​ అదుర్స్​ అంటూ ఫ్యాన్స్​ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఓ సారి మీరూ ఆ చిత్రం చూసేయండి.

ధోనీ న్యూ లుక్
ధోనీ న్యూ లుక్
author img

By

Published : Jan 20, 2023, 3:19 PM IST

భారత క్రికెట్​ జట్టు మాజీ సారధి ఎంఎస్​ ధోనీ.. సోషల్​మీడియాలో ఎక్కువగా కనిపించరు. అయినా కూడా అతడి ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. ఇందుకు కారణం.. మహీ సతీమణ్ సాక్షి సింగ్​తో పాటు ఆయన ఫ్యాన్స్​ తరుచూ పోస్ట్​లు చేస్తుంటారు. అంతే కాదు ధోనీకి చెందిన ట్విట్టర్​, ఇన్​స్టాగ్రామ్​ ఖాతాలను సాక్షినే హ్యాండిల్ చేస్తుంటుంది. అయితే తాజాగా ధోనీకి సంబంధించిన ఓ ఫొటో.. సోషల్​మీడియాలో వైరల్​గా మారింది.

అందులో ధోనీ సాల్ట్​ అండ్​ పెప్పర్​ లుక్​లో కనిపిస్తున్నాడు. ప్రముఖ స్పోర్ట్స్​ వెబ్​సైట్​ క్రిక్​ట్రాకర్​ ఆ ఫొటోను షేర్​ చేసింది. దీంతో ధోనీ ఫ్యాన్స్​ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మాస్​ లుక్​లో మహీ అదరగొట్టాడని అంటున్నారు. మరికొందరేమో తలైవా స్టైల్​ అదిరిందని కామెంట్లు పెడుతున్నారు.

ధోనీ న్యూ లుక్
ధోనీ న్యూ లుక్

క్రికెట్ ప్రపంచంలో తనదైన సారథ్యంతో గొప్ప కెప్టెన్‌గా గుర్తింపు పొందిన ఎంఎస్ ధోనీ.. ఎవరికీ సాధ్యం కానీ అరుదైన ఘనతను తన పేరుపై లిఖించుకున్నాడు. టీ20 ప్రపంచకప్ 2007ను టీమ్​ఇండియాకు అందించిన ధోనీ.. మూడు దశాబ్దాలుగా ఊరించిన వన్డే ప్రపంచకప్‌ను 2011లో అందించాడు. ఇక 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచి.. ఐసీసీ టైటిళ్లన్నీ గెలిచిన ఏకైక కెప్టెన్‌గా రికార్డుల్లో నిలిచాడు. మూడు ఐసీసీ టైటిల్స్ ఇప్పటికీ ఎవరూ గెలవలేదు.

2020 ఆగస్టులో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పాడు మహీ. అంతర్జాతీయ కెరీర్‌లో మహీ 90 టెస్ట్‌ మ్యాచ్‌ల్లో 4,876 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 350 వన్డే మ్యాచ్‌ల్లో 10,773 రన్స్‌ బాదాడు. వీటిల్లో 10 సెంచరీలతో పాటు 73 అర్థ శతకాలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 183‌. ఇక 98 టీ20 మ్యాచ్‌లలో 1,617 పరుగుల చేశాడు. ఐపీఎల్ టోర్నీలో 234 మ్యాచులు ఆడిన ధోనీ 4,978 రన్స్ బాదాడు.

ప్రస్తుతం ఐపీఎల్​లో చెన్నై సూపర్​ కింగ్స్​ జట్టుకు కెప్టెన్​గా ధోనీ వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ ఏడాది చివరి మ్యాచ్​ ఆడి ఐపీఎల్​కు మహీ వీడ్కోలు పలుకుతాడని సమాచారం. కానీ ఐపీఎల్​లో ఈసారి మరింత మెరుగ్గా రాణించేందుకు మిస్టర్​ కూల్​ అప్పుడే ప్రాక్టీస్​ను కూడా మొదలుపెట్టేశాడు. నెట్స్​లో త్రీవంగా శ్రమిస్తున్నాడు. ధోనీ ప్రాక్టీస్​ ఫొటోలు చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.