ETV Bharat / sports

357స్కోర్​, 55కు ఆలౌట్​- ప్రపంచకప్​లో టీమ్​ఇండియా భారీ విజయాలివే! - టీమ్​ఇండియా వరల్డ్​కప్​ రికార్డ్స్​

Team India Biggest Winnings In CWC : వ‌ర‌ల్డ్​ క‌ప్​లో టీమ్​ఇండియా జైత్ర యాత్ర కొన‌సాగుతోంది. ఆడిన 8 మ్యాచుల్లోనూ విజ‌యం సాధించి సెమీస్​కు వెళ్లిన మొద‌టి జ‌ట్టుగా నిలిచింది. ఈ త‌రుణంలో ప్ర‌పంచ క‌ప్​ చ‌రిత్ర‌లో ఇప్పటివరకు టీమ్​ఇండియా భారీ విజ‌యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Indias Biggest Victories In Worldcup Cricket History
Team India Biggest Winnings In CWC
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 10, 2023, 7:21 AM IST

Team India Biggest Winnings In CWC : భారత్​ ఆతిథ్యం ఇస్తున్న 2023-వ‌ర‌ల్డ్​ క‌ప్​ తుది ద‌శ‌కు చేరుకుంది. ఈ నెల 12తో లీగ్ స్టేజీ మ్యాచులు అయిపోతాయి. ఈ టోర్నీలో టీమ్​ఇండియా మంచి దూకుడు మీద ఉంది. ఆడిన ప్ర‌తి మ్యాచ్​లోనూ ప్ర‌త్య‌ర్థిని మ‌ట్టిక‌రిపిస్తూ ముందుకెళుతోంది. వ‌రుసగా 8 విజ‌యాలు సాధించింది. దీంతో సెమీస్​కు చేరిన తొలి జ‌ట్టుగా భారత్​ నిలిచింది. కాగా, కొన్ని మ్యాచుల్లో భారీ ప‌రుగుల తేడాతో ప్రత్యర్థులను చిత్తుగా ఓడించింది. ఇదిలా ఉంటే ప్రపంచకప్​ క్రికెట్​ చరిత్రలో ఏయే ప్రత్యర్థి జట్లపై భారీ ప‌రుగుల తేడాతో టీమ్ఇండియా విజ‌యాలు సాధించిందో ఇప్పుడు తెలుసుకుందాం.

శ్రీ‌లంక‌పై 302 ప‌రుగులతో..
ప్ర‌స్తుతం జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్​ క‌ప్​ టోర్నీలోనే భారత్​.. ప్ర‌పంచ క‌ప్​ చ‌రిత్ర‌లోనే ప‌రుగుల ప‌రంగా త‌న రెండో అతిపెద్ద విజ‌యాన్ని న‌మోదు చేసింది. ముంబ‌యిలోని వాంఖ‌డే స్టేడియంలో జరిగిన మ్యాచ్​లో శ్రీ‌లంక‌ను 302 ప‌రుగుల భారీ తేడాతో ఓడించింది. ఆ మ్యాచ్​లో మొద‌ట బ్యాటింగ్ చేసిన టీమ్​ఇండియా 357 పరుగులు భారీ స్కోర్​ను లంక టీమ్​ ముందుంచుంది. త‌ర్వాత బ్యాటింగ్​కు వ‌చ్చిన లంక‌ను 55 ప‌రుగుల‌కే ఆలౌట్ చేసింది. దీంతో భారత్​ ఖాతాలో మరో భారీ విజ‌యం చేరింది.

బెర్ముడాపై 257 ప‌రుగులతో..
2007-వ‌న్డే వ‌రల్డ్ క‌ప్​లో టీమ్ఇండియా బెర్ముడా జట్టుపై 257 ప‌రుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఆ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​కు దిగిన భారత్​.. 5 వికెట్లు కోల్పోయి 413 ర‌న్స్ చేసింది. త‌ర్వాత ప్ర‌త్య‌ర్థి బెర్ముడాను 156 ప‌రుగుల‌కే ఆలౌట్ చేసింది. దీంతో 257 ప‌రుగుల తేడాతో గెలిచి భారీ విజ‌యాన్ని ద‌క్కించుకుంది.

ద‌క్షిణాఫ్రికాపై 243 ప‌రుగులతో..
ఈనెల 5న కోల్​క‌తాలో దక్షిణాఫ్రికాతో జ‌రిగిన మ్యాచ్​లో 243 ప‌రుగుల భారీ తేడాతో జ‌య‌కేత‌నం ఎగుర‌వేసింది టీమ్​ఇండియా. మొద‌ట బ్యాటింగ్​ చేసిన భారత్​ 327 భారీ టార్గెట్​ను సఫారీల ముందుంచింది. ఆ తర్వాత బ్యాటింగ్​కు దిగిన సౌతాఫ్రికా బ్యాటర్లపై భారత బౌలర్లు విరుచుకుపడ్డారు. దీంతో ఆ జట్టు 83 పరుగులకే కుప్పకూలింది. ఈ విక్టరీతో ప్రపంచకప్​ చరిత్రలోనే మరో మరుపు రాని రికార్డును భారత్​ తన ఖాతాలో వేసుకుంది.

శ్రీ‌లంక‌పై 183 ప‌రుగులతో..
2003 వ‌ర‌ల్డ్​ క‌ప్​ టోర్నీలో ఫైనల్ వ‌ర‌కు వెళ్లిన టీమ్​ఇండియా.. శ్రీ‌లంక జ‌ట్టుపై అత్యధిక ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. ద‌క్షిణాఫ్రికాలోని జెహ‌నెస్​ బ‌ర్గ్​లో జ‌రిగిన మ్యాచ్​లో 183 పరుగుల తేడాతో లంక జ‌ట్టును ఓడించింది. ఆ టోర్నీలో ఆస్ట్రేలియాతో ఫైనల్​ పోరులో తలపడ్డ టీమ్​ఇండియాకు ఓటమి తప్పలేదు. దీంతో రెండో సారి కూడా కప్పును ముద్దాడే అవకాశాన్ని చేజార్చుకుంది.

విరాట్ టు వార్న‌ర్‌- ప్ర‌పంచ క‌ప్​లో టాప్ -5 బ్యాట‌ర్లు​ వీరే!

వన్డే ర్యాంకింగ్స్​లో ఈ బ్యాటర్లదే హవా - ప్రపంచంలోనే ఏకైక ప్లేయర్​గా వివ్ రిచర్డ్స్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.