ETV Bharat / sports

ఐపీఎల్​ నిర్వహణకు ఖర్చెంతో తెలుసా? - BCCI paid Emirates Cricket Board 100 crore

ఐపీఎల్​-2020 ఆతిథ్యం కోసం ఎమిరేట్స్​ క్రికెట్​ బోర్డుకు బీసీసీఐ రూ.100కోట్లపైనే చెల్లించిందని తెలిసింది. ఈ విషయాన్ని ఓ ప్రముఖ వార్త సంస్థ స్పష్టం చేసింది.

ఐపీఎల్​
IPL 2020
author img

By

Published : Nov 15, 2020, 2:31 PM IST

కరోనా పరిస్థితుల్లో అసాధ్యమనుకున్న ఈ ఏడాది ఐపీఎల్​ను యూఏఈలో విజయవంతంగా నిర్వహించింది బీసీసీఐ. ఇందుకోసం ఎమిరేట్స్​ క్రికెట్​ బోర్డుకు వంద కోట్ల రూపాయలకుపైనే చెల్లించినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఓ ప్రముఖ వార్తా సంస్థ ప్రచురించింది.

సాధారణంగా లీగ్​ భారత్​లో జరిగితే.. ఆయా రాష్ట్ర సంఘాలకు మ్యాచ్​కు కోటి రూపాయల చొప్పున చెల్లిస్తుంది బీసీసీఐ. దీని ప్రకారం మొత్తం 60 మ్యాచ్​లకు 60కోట్లు ఖర్చవుతుంది. అయితే ఈ మొత్తం చెల్లించేందుకు రూ.30 నుంచి 50 లక్షలను ఫీజు రూపంలో ఫ్రాంఛైజీల నుంచి వసూలు చేస్తుంది బీసీసీఐ.

ఈ ఏడాది దుబాయ్​లో లీగ్​ జరగడం వల్ల మ్యాచ్​ నిర్వహణ ఖర్చులతో సహా క్రీడాకారుల వసతులు, ఆహారం, ప్రయాణ ఖర్చుల మొత్తం కలిపి రూ.104 కోట్లను ఎమిరేట్స్​ క్రికెట్​ బోర్డుకు చెల్లించింది భారత బోర్డు. కాబట్టి ఇక్కడితో పోలిస్తే దుబాయ్​లో నిర్వహించినందుకు ఎక్కువ ఖర్చయింది.

ఈ ఏడాది ఐపీఎల్​లో రోహిత్​ శర్మ సారథ్యంలోని ముంబయి ఇండియన్స్​ ట్రోఫీని సొంతం చేసుకుంది. దీంతో లీగ్​ చరిత్రలోనే అత్యధికంగా ఐదు సార్లు కప్​ను గెలుచుకున్న ఏకైక జట్టుగా నిలిచింది. తొలిసారి ఫైనల్​ చేరిన దిల్లీ క్యాపిటల్స్​.. రన్నరప్​తో సరిపెట్టుకుంది.

ఇదీ చూడండి : '2021లోనూ సన్​రైజర్స్​తోనే విలియమ్సన్'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.