ETV Bharat / sports

సన్​రైజర్స్​కు వార్నర్, బెయిర్​స్టో గుడ్​బై - సన్​రైజర్స్ హైదరాబాద్ బెయిర్​స్టో

Sunrisers Hyderabad Retained Players 2022: ఐపీఎల్ 2022 మెగావేలానికి ముందు సన్​రైజర్స్ హైదరాబాద్​కు గుడ్​బై చెప్పేశారు ఈ జట్టు స్టార్ ఓపెనర్లు వార్నర్, బెయిర్​స్టో. నేడు రిటైన్ చేసుకోనున్న వారి జాబితాను ప్రకటించడానికి ముందు ఆటగాళ్లందరికీ కృతజ్ఞతలు తెలిపింది ఫ్రాంచైజీ. దీనికి కామెంట్ పెడుతూ.. మద్దతుగా నిలిచిన అభిమానులకు థ్యాంక్స్ చెప్పారు వార్నర్, బెయిర్​స్టో

David Warner
David Warner
author img

By

Published : Nov 30, 2021, 7:55 PM IST

Sunrisers Hyderabad Retained Players 2022: ఐపీఎల్ మెగావేలం జనవరిలో జరగనుంది. ఇందుకోసం ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకునే ఆటగాళ్లను నేడు (మంగళవారం) వెల్లడించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీలు రిటెన్షన్ కోసం ప్రణాళికలు రచిస్తున్నాయి. నేటి రాత్రి వరకు ఏ జట్టు ఎవరిని అట్టిపెట్టుకుంటుందో అనే విషయంపై స్పష్టత వస్తుంది. ఈ నేపథ్యంలో సన్​రైజర్స్​ హైదరాబాద్ ఓ ట్వీట్ చేసింది. ఏళ్లుగా జట్టుకు అండగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు తెలిపింది. ఈ ట్వీట్​కు ఈ ఫ్రాంచైజీ స్టార్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్, బెయిర్​స్టో రిప్లై ఇచ్చారు. దీంతో వీరిద్దరూ సన్​రైజర్స్ నుంచి తప్పుకొంటున్నట్లు స్పష్టమవుతోంది.

"కొంతకాలంగా నా కెరీర్​ ఎత్తుపల్లాల్లో అండగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు. మాతో పాటు జట్టుపైనా మీరు చూపిన ప్రేమ ఎంతో గొప్పది. మీ భవిష్యత్ బాగుండాలని నేను, క్యాండిస్ కోరుకుంటున్నాం. మీరు ఏ జట్టుకు మద్దతు తెలిపినా అది ఉన్నతంగా ఉంటుంది. ప్రేమతో వార్నర్స్" అంటూ కామెంట్ పెట్టాడు వార్నర్.

"ఇక ఇదే పోస్టుకు బెయిర్​స్టో కూడా కామెంట్ పెట్టాడు. "మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. భవిష్యత్​లో మళ్లీ కలుస్తామని ఆశిస్తున్నా" అంటూ సన్​రైజర్స్​కు గుడ్​బై చెప్పాడీ ఇంగ్లీష్ ఓపెనర్.

David Warner jonny bairstow
సన్​రైజర్స్​కు వార్నర్, బెయిర్​స్టో గుడ్​బై

రషీద్ గుడ్​బై

సన్​రైజర్స్​ ఫ్రాంఛైజీ తనను నెంబర్ 1 రిటెన్షన్ ఆటగాడిగా తీసుకుంటేనే ఆ జట్టులో కొనసాగుతానని అఫ్గానిస్థాన్ ఆటగాడు రషీద్ ఖాన్ చెప్పినట్లు సమాచారం. దీనికి సన్​రైజర్స్ విముఖత వ్యక్తం చేయడం వల్ల ఇతడిని కూడా దూరం చేసుకుందీ ఫ్రాంచైజీ.

విలియమ్సన్​తో పాటు బౌలర్ ఉమ్రాన్ మాలిక్, బ్యాట్స్‌మెన్ అబ్దుల్ సమద్‌ను సన్​రైజర్స్ రిటైన్ చేసుకుంటుందని తెలుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.