ETV Bharat / sports

అత్యాచార కేసులో క్రికెటర్ అరెస్ట్​.. జాతీయ జట్టు నుంచి కూడా సస్పెండ్​​ - ధనుష్క గుణతిలక సస్పెండ్​

అత్యాచారా ఆరోపణలతో అరెస్ట్ అయిన శ్రీలంక క్రికెటర్​ ధనుష్క గుణతిలకను సస్పెండ్​ చేస్తూ ఆ దేశ క్రికెట్​ బోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.

sri-lanka-cricket
ధనుష్క గుణతిలక
author img

By

Published : Nov 7, 2022, 2:01 PM IST

అత్యాచారం కేసులో ఆస్ట్రేలియాలో అరెస్టైన శ్రీలంక క్రికెటర్ ధనుష్క గుణతిలకను సస్పెండ్ చేస్తూ లంక క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. తక్షణమే అన్ని ఫార్మాట్ల నుంచి గుణతిలకను సస్పెండ్ చేస్తున్నామని... సెలెక్టర్లు అతన్ని పరిగణలోకి తీసుకోవద్దని శ్రీలంక ఎగ్జిక్యూటివ్‌ కమిటీ పేర్కొంది.

ఈ ఘటనపై శ్రీలంక క్రికెట్ బోర్డు పూర్తి విచారణ జరుపుతుందని గుణతిలక దోషిగా తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. ఇలాంటి ఘటనలను ఉపేక్షించేది లేదని ఆస్ట్రేలియా అధికారులకు దర్యాప్తులో పూర్తిగా సహకరిస్తామని తెలిపింది. ఈనెల 2న ధనుష్క గుణతిలక లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఈ ఆరోపణలపై గుణతిలకను విచారించిన సిడ్నీ పోలీసులు అనంతరం అరెస్టు చేశారు. మరోవైపు గుణతిలకకు బెయిల్ ఇవ్వాలని అతని తరఫు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది.

ఇదీ చదవండి:

హాఫ్​ సెంచరీలతో అదరగొట్టిన సూర్య, రాహుల్​.​. జింబాబ్వే టార్గెట్​ ఎంతంటే?

హయ్యెస్ట్ ఫాలోవర్స్ కలిగిన టాప్ 10 క్రికెటర్స్ వీరే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.