ETV Bharat / sports

శ్రేయస్ టెస్టు అరంగేట్రం ఖరారు.. రహానె క్లారిటీ

టీమ్ఇండియా యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ టెస్టు అరంగేట్రానికి(Shreyas Iyer Test debut) అంతా సిద్ధమైంది. గురువారం న్యూజిలాండ్​తో ప్రారంభమయ్యే తొలి టెస్టులో శ్రేయస్​ను తుదిజట్టులోకి తీసుకుంటున్నట్లు తెలిపాడు కెప్టెన్ అజింక్యా రహానె.

Shreyas Iyer Team India Test debut, Shreyas Iyer latest news, శ్రేయస్ అయ్యర్ టెస్టు అరంగేట్రం, శ్రేయస్ అయ్యర్ న్యూజిలాండ్ టెస్టు
శ్రేయస్
author img

By

Published : Nov 24, 2021, 4:02 PM IST

Updated : Nov 24, 2021, 5:23 PM IST

Shreyas Iyer Test debut: టీమ్‌ఇండియా యువ ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌ టెస్టు క్రికెట్‌ అరంగేట్రం ఖాయమైంది. న్యూజిలాండ్‌తో జరుగనున్న తొలి టెస్టులో అతడిని జట్టులోకి తీసుకోనున్నట్లు తాత్కాలిక కెప్టెన్‌ అజింక్యా రహానె ప్రకటించాడు. పలువురు కీలక ఆటగాళ్లు ఈ సిరీస్‌కు దూరమైన నేపథ్యంలో సెలెక్టర్లు యువ ఆటగాళ్లకు తుది జట్టులో చోటు కల్పించాలని నిర్ణయించారు. తొడ కండరాల గాయం కారణంగా ఓపెనర్ కేఎల్ రాహుల్‌ ఈ సిరీస్‌కు దూరమైనట్లు బీసీసీఐ మంగళవారం వెల్లడిండింది. రాహుల్ స్థానంలో సూర్యకుమార్‌ యాదవ్‌ను జట్టులోకి తీసుకుంది. అయితే, జట్టు బ్యాటింగ్‌ విభాగంలో సమతూకం కోసం శ్రేయస్ అయ్యర్‌ను కూడా జట్టులోకి తీసుకుంటున్నట్లు అజింక్యా రహానె బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించాడు.

Ajinkya Rahane on KL rahul: గాయంతో కివీస్‌తో టెస్టు సిరీస్‌కు దూరమైన కేఎల్‌ రాహుల్‌ స్థానంలో సూర్యకుమార్‌ యాదవ్‌కు టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్‌ చోటు కల్పించింది. ఈ సందర్భంగా రాహుల్ లేని లోటు ఎలా ఉంటుందనే దానిపై కెప్టెన్‌ అజింక్యా రహానె స్పందించాడు. కేఎల్‌ రాహుల్‌ లేకపోవడం దెబ్బేనని అయితే భారత ఓపెనింగ్‌ కాంబినేషన్‌ మీద ఆ ప్రభావం ఏమాత్రం పడబోదని రహానె స్పష్టం చేశాడు. ఇంగ్లాండ్‌ సిరీస్‌లో రాహుల్‌ అద్భుతంగా రాణించాడని, అయితే ఈ సిరీస్‌కు లేకపోయినా కంగారు పడాల్సిన అవసరం లేదని రహానె పేర్కొన్నాడు. టీమ్‌ఇండియాకు మంచి యువ క్రికెటర్లు అందుబాటులో ఉన్నారని, వారిలో ఒకరు ఓపెనింగ్‌ స్థానాన్ని భర్తీ చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు.

ajinkya rahane about Dravid: రాహుల్‌ ద్రవిడ్‌ కోచ్‌గా రావడంపై రహానె స్పందిస్తూ.. ‘"రాహుల్‌ ద్రవిడ్‌ ఒక్కటే చెప్పాడు. ఎక్కువ ఆలోచించకుండా మా శైలిలో ఆడాలని సూచించాడు. పుజారాకు, నాకు గేమ్‌ ప్లాన్‌ ఏంటో తెలుసు. దానిని మైదానంలో అమలు చేసేందుకు ప్రయత్నిస్తాం. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌ లేకపోవడం యువ క్రికెటర్లకు సదావకాశం. దీనిని సద్వినియోగం చేసుకోవడానికి బాగా ఆడాలి. స్వేచ్ఛగా ఆడితే వాటంతటవే పరుగులు వచ్చేస్తాయి. అలానే ఇక్కడి పరిస్థితులు వేరు, దక్షిణాఫ్రికాలో పరిస్థితులు వేరేగా ఉంటాయి. కాబట్టి మేం మొదట కివీస్‌తో టెస్టు సిరీస్‌పైనే దృష్టిసారించాం" అని రహానె వివరించాడు.

భారత్, కివీస్‌ జట్ల మధ్య తొలి టెస్టు(IND vs NZ test) గురువారం (నవంబర్ 25) నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్​కు రోహిత్‌ శర్మ, కేఎల్ రాహుల్ దూరం కావడం వల్ల.. మయాంక్ అగర్వాల్‌, శుభ్‌మన్‌ గిల్ ఓపెనర్లుగా వచ్చే అవకాశం ఉంది. పేస్‌ విభాగంలో ఇషాంత్‌ శర్మ, ఉమేశ్‌ యాదవ్‌, స్పిన్ విభాగంలో రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌లతో టీమ్‌ఇండియా బరిలోకి దిగనుంది.

ఇవీ చూడండి: ICC T20 RANKINGS:మెరుగైన రాహుల్ ర్యాంకు.. కోహ్లీ టాప్-10 గల్లంతు

Last Updated : Nov 24, 2021, 5:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.