Shreyas Iyer KKR Captain IPL 2024 : టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్‌గా తిరిగి నియామకమయ్యాడు. నితీశ్ రాణాను వైస్ కెప్టెన్‌గా నియమించారు. ఈ మేరకు జట్టు మేనేజ్మెంట్ గురువారం సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో ఓ ప్రకటన విడుదల చేసింది. వచ్చే ఐపీఎల్ సీజన్లో మరోసారి శ్రేయస్‌కే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినట్లు కోల్‌కతా జట్టు సీఈఓ వెంకీ మైసూర్ వెల్లడించారు.
"గాయం కారణంగా శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ 2023 దూరం కావడం దురదృష్టకరం. అతడు మళ్లీ కెప్టెన్‌గా తిరిగి రావడం పట్ల మాకు సంతోషంగా ఉంది. శ్రేయస్ గాయం నుంచి కోలుకోవడానికి పడ్డ కష్టం, తర్వాత ఫామ్‌లోకి రావడం అతడి వ్యక్తిత్వానికి అద్దం పడుతోంది. శ్రేయస్ లేనప్పుడు నితీశ్ రాణా సారథ్య బాధ్యతలు చేపట్టి మెప్పించాడు. కేకేఆర్ టీమ్ కోసం నితీశ్ వైస్ కెప్టెన్‌గా, శ్రేయస్‌కు సాధ్యమైన ప్రతి విషయంలో మద్దతిస్తాడనంలో సందేహం లేదు."
--వెంకీ మైసూర్, కేకేఆర్ సీఈఓ
-
Quick Update 👇#IPL2024 @VenkyMysore @ShreyasIyer15 @NitishRana_27 pic.twitter.com/JRBJ5aEHRO
— KolkataKnightRiders (@KKRiders) December 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Quick Update 👇#IPL2024 @VenkyMysore @ShreyasIyer15 @NitishRana_27 pic.twitter.com/JRBJ5aEHRO
— KolkataKnightRiders (@KKRiders) December 14, 2023Quick Update 👇#IPL2024 @VenkyMysore @ShreyasIyer15 @NitishRana_27 pic.twitter.com/JRBJ5aEHRO
— KolkataKnightRiders (@KKRiders) December 14, 2023
2022 ఐపీఎల్ ఎడిషన్‌లో కెప్టెన్‌గా ఉన్న శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా 2023 ఐపీఎల్‌కు దూరమయ్యాడు. దీంతో శ్రేయస్ స్థానంలో జట్టు సారథ్య బాధ్యతలు నితీశ్ రాణాకు అప్పగించారు. తాజాగా కెప్టెన్సీ తిరిగి శ్రేయస్‌కు అప్పగించడానికి నితీశ్ ఒప్పుకున్నాడు. దీనిపై స్పందించిన శ్రేయస్ తాను లేని సమయంలో జట్టు బాధ్యతలను నితీశ్ సమర్థంగా నిర్వర్తించాడని కొనియాడాడు.
Nitish Rana KKR Vice Captain : అయితే నితీశ్ కెప్టెన్సీ మేనేజ్మెంట్, జట్టు సభ్యులకు ఎలా ఉన్నా గత ఎడిషన్‌లో మాత్రం కేకేఆర్ రాణించలేకపోయింది. రింకూ సింగ్ వంటి ప్లేయర్లు మెరుపులు మెరిపించినా శ్రేయస్ లేని లోటు కనిపించింది. ఫలితంగా టోర్నీని జట్టు ఏడో స్థానంతో ముగించింది. గాయం నుంచి కోలుకున్న శ్రేయస్ అయ్యర్ ఇటీవల ముగిసిన ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లో అద్భుతంగా రాణించాడు. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో కోల్‌కతా ఈసారి మంచి ప్రదర్శన కనబరుస్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
చరిత్ర సృష్టించిన వృందా రాఠీ- భారత తొలి మహిళా టెస్ట్ క్రికెట్ అంపైర్‌గా ఘనత
నాకు దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి ఉంది- నా మూత్రపిండాలు సరిగా పనిచేయలేవు! : కామెరూన్ గ్రీన్