ETV Bharat / sports

సౌతాఫ్రికా పేసర్ లుంగి ఎంగిడికి కరోనా.. ఆ సిరీస్​కు దూరం - లుంగి ఎంగిడికి కొవిడ్

దక్షిణాఫ్రికా పేసర్​ లుంగి ఎంగిడికి (Lungi Ngidi News) కొవిడ్ పాజిటివ్​గా తేలింది. ఈ విషయాన్ని క్రికెట్ దక్షిణాఫ్రికా బోర్డు వెల్లడించింది.

lungi ngidi
లుంగి ఎంగిడి
author img

By

Published : Nov 25, 2021, 8:51 AM IST

Updated : Nov 25, 2021, 11:49 AM IST

దక్షిణాఫ్రికా పేసర్ లుంగి ఎంగిడికి(Lungi Ngidi News) కొవిడ్ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ఈ నేపథ్యంలో నెదర్లాండ్స్​తో జరగనున్న వన్డే సిరీస్​కు దూరమవుతున్నట్లు బుధవారం పేర్కొన్నాడు. ఎంగిడి స్థానంలో పేసర్ జూనియర్ దాలాను జట్టులోకి తీసుకున్నట్లు క్రికెట్ సౌతాఫ్రికా పేర్కొంది.

"కొవిడ్​ కారణంగా లుంగి ఎంగిడి మూడు మ్యాచ్​ల వన్డే సిరీస్​కు దూరమవ్వాల్సి వచ్చింది. ప్రస్తుతం అతడు కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ ఐసోలేషన్​లో ఉన్నాడు. మెడికల్​ బృందం పర్యవేక్షణలో అతడికి అన్ని ఏర్పాట్లు కల్పించాం. ఎంగిడి స్థానంలో జూనియర్ దాలా జట్టులో ఆడనున్నాడు." అని క్రికెట్ సౌతాఫ్రికా తమ అధికారిక ప్రకటనలో పేర్కొంది.

జులైలో ఐర్లాండ్​తో సిరీస్​ నుంచి లుంగి.. దక్షిణాఫ్రికా తరఫున ఒక్క మ్యాచ్​ కూడా ఆడలేదు. వ్యక్తిగత కారణాల వల్ల సెప్టెంబర్​లో శ్రీలంక పర్యటనకు దూరమయ్యాడు. టీ20 ప్రపంచకప్​లో స్థానం దక్కినా ఆడలేదు.

ఇదీ చదవండి:

IND vs NZ test 2021: బలంగా కివీస్.. కుర్రాళ్లతో భారత్!

Last Updated : Nov 25, 2021, 11:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.