ETV Bharat / sports

భారత్​ పాక్​ మ్యాచ్​పై కెప్టెన్​ రోహిత్​ కామెంట్​, ఆ విషయం చాలా సీక్రెట్​ అంటూ

Rohithsharma about ind vs pak match openers ఆసియాకప్​లో భాగంగా మరి కొన్ని గంటల్లో పాకిస్థాన్​తో జరగబోయే మ్యాచ్ గురించి మాట్లాడాడు టీమ్​ఇండియా కెప్టెన్​ రోహిత్ శర్మ. ఏమన్నాడంటే

rohith sharma
రోహిత్​ శర్మ
author img

By

Published : Aug 28, 2022, 12:33 PM IST

Rohithsharma about ind vs pak match openers మ్యాచ్‌ల సమయంలో నిర్వహించే విలేకర్ల సమావేశంలో భారత సారథి రోహిత్‌ శర్మ చాలా సరదాగా ఉంటాడు..! విలేకర్లపై పంచులు విసురుతూ నవ్వులు పూయిస్తాడు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకొంది. నిన్న రోహిత్‌ విలేకర్ల సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఓ పాకిస్థానీ జర్నలిస్టు నుంచి భారత ఓపెనింగ్‌పై ప్రశ్న ఎదురైంది. "గత కొన్ని సిరీసుల నుంచి భారత్‌ కొత్త కాంబినేషన్లను ప్రయత్నిస్తోంది. కొన్ని సార్లు పంత్‌ వస్తే.. మరికొన్ని సార్లు సూర్యకుమార్‌ యాదవ్‌ వస్తున్నాడు. కేఎల్‌ రాహుల్‌ లేకపోవడంతోనే ఇలా చేస్తున్నారా..? ఇప్పుడతడు వచ్చేశాడుగా. అతడి స్థానంలోనే వస్తాడా లేదా రేపు మీతోపాటు కొత్త ఓపెనింగ్‌ భాగస్వామి కనిపిస్తాడా..?" అని అడిగాడు.

మ్యాచ్‌ వ్యూహాన్ని బయటకు వెల్లడించేందుకు ఇష్టపడిని హిట్‌మ్యాన్‌.. సరదాగా ఆ ప్రశ్నను దాటవేశాడు. "ఆదివారం టాస్‌ వేశాక మీరే చూడండి.. ఎవరు వస్తారో. మమ్మల్ని కూడా కొన్ని రహస్యాలను దాచుకోనీయండి మిత్రమా. మేం కొత్తవి ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాం. వాటిల్లో కొన్ని పని చేస్తే.. మరికొన్ని ఫలితాన్ని ఇవ్వవు. ప్రయత్నించడంలో తప్పులేదు. అవకాశం వచ్చినప్పుడల్లా కొత్తవి ప్రయత్నిస్తాం" అని రోహిత్‌ నవ్వుతూ సమాధానమిచ్చాడు.

ఇదీ చూడండి: Asia Cup IND VS PAK ఈ 10 ఆసక్తికర విషయాలు తెలుసా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.