ETV Bharat / sports

రింకూ 5సిక్సుల షో​- బ్యాటర్​కు రూ.55లక్షలు- బౌలర్​కు రూ.5కోట్లు! - ipl player salary rules

Rinku Singh Ipl Salary 2024 : 2024 ఐపీఎల్ సీజన్​కుగాను ప్లేయర్ల శాలరీ విషయంలో బీసీసీఐ కొత్త నిబంధన తీసుకురానుంది. ఈ రూల్ అన్​క్యాప్డ్​ ప్లేయర్లకు వరంలా ఉంటే, స్టార్ బ్యాటర్ రింకూ సింగ్​ను మాత్రం నష్టపరుస్తోంది. అదెలా అంటే?

Rinku Singh Ipl Salary 2024
Rinku Singh Ipl Salary 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 23, 2023, 10:26 AM IST

Rinku Singh Ipl Salary 2024 : 2024 ఐపీఎల్​ నుంచి ప్లేయర్ల శాలరీ విషయంలో బీసీసీఐ కొత్త రూల్​ తీసుకురానుంది. ఈ నిబంధన ప్రకారం, ఎవరైనా అన్​క్యాప్డ్​ ప్లేయర్​ ఐపీఎల్​లో ఆడి​ తర్వాత టీమ్ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహిస్తే, తదుపరి సీజన్​లో అతడి శాలరీ పెరుగుతుంది. అంటే ఓ ప్లేయర్ ఐపీఎల్​లో రూ. 20లక్షల శాలరీతో ఆడి, తర్వాత టీమ్ఇండియాలో ఎంట్రీ ఇస్తే అతడి జీతం డైరెక్ట్​గా రూ.50 లక్షలకు పెరుగుతుంది.

అదే 5-9 మ్యాచ్​ల్లో ఆడితే రూ. 75 లక్షలు, 10 మ్యాచ్​లకు మించి ప్రాతినిధ్యం వహిస్తే రూ. 1కోటి శాలరీ అందుకునేలా ఈ రూల్ రానుంది. అయితే ఈ నిబంధన ప్రకారం యంగ్ బ్యాటర్ రింకూ సింగ్ 2024 ఐపీఎల్ సీజన్​కుగాను​ రూ. కోటి శాలరీ అందుకోవాలి. అతడు ఇప్పటివరకూ రెండు ఫార్మట్​లలో కలిపి 14 మ్యాచ్​ల్లో టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించాడు.

అయితే ఇక్కడ ఓ ఫిట్టింగ్ ఉంది. నిబంధనల ప్రకారం అన్​క్యాప్డ్​ ప్లేయర్ జీతం రూ.50 లక్షలు కంటే తక్కువగా ఉంటేనే ఇది వర్తిస్తుంది. కానీ, రింకూ ప్రస్తుత ఐపీఎల్ శాలరీ రూ.55 లక్షలు. ఈ కారణంగా రింకూ రూ.45 లక్షలు నష్టపోయినట్టే. అని చెప్పాలి. ఇక ఈ రూల్​ ప్రకారం యంగ్ బ్యాటర్ రజత్ పతిదార్ శాలరీ రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షలకు పెరగనుంది. పతిదార్ సౌతాఫ్రికా పర్యటనలో తాజాగా ముగిసిన వన్డే సిరీస్​లో మూడో మ్యాచ్​తో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.

ఇది అసలైన విచిత్రం : ఇదిలా ఉండగా రింకూ 2023 ఐపీఎల్​లో గుజరాత్ పేసర్ యశ్ దయాల్​ బౌలింగ్​లో వరుసగా 5సిక్స్​లు బాది వెలుగులోకి వచ్చాడు. అయితే గుజరాత్ యశ్ దయాల్​ను వదులుకుంది. దీంతో అతడు వేలంలోకి వచ్చాడు. అయితే తాజాగా జరిగిన ఈ వేలంలో ఎవరూ ఊహించని రీతిలో రూ. 5 కోట్లకు యశ్ దయాల్​ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. దీంతో 5 సిక్స్​లు బాదిన ప్లేయర్​కు రూ.55 లక్షల శాలరీ ఉండగా, 5సిక్స్​లు సమర్పించుకున్న ఆటగాడు రూ.5 కోట్లు దక్కించుకోవడం నెటిజన్లు ఆశ్చర్యపరుస్తోంది.

'రింకూ సింగ్​-సిక్సర్​ కింగ్​, ఆటోగ్రాఫ్​ ప్లీజ్ భయ్యా!​'- ఫ్యాన్​ మూమెంట్​ అంటే ఇదే కదా!

'రింకూలో ఆ టాలెంట్​ గుర్తించింది అతడే' - ధోనీ నుంచే ఆ ట్రిక్ నేర్చుకున్నాడట!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.