హోరాహోరీ పోరాటాలకు వేదికగా నిలిచిన మహిళల టీ20 ప్రపంచకప్ ముగిసింది. ఫైనల్మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శనతో ఆరోసారి వరల్డ్‌కప్‌ను ఆస్ట్రేలియా ముద్దాడింది. వరుసగా మూడోసారి కప్ గెలిచి సరికొత్త రికార్డును సృష్టించింది. అయితే మహిళల టీ20 ప్రపంచకప్‌లో అత్యంత విలువైన జట్టు పేరుతో ఓ టీమ్‌ను ఐసీసీ.. సోమవారం ప్రకటించింది.
అందులో టీమ్ఇండియాకు చెందిన వికెట్ కీపర్, బ్యాటర్ రిచా ఘోష్ చోటు సంపాదించింది. రికార్డు స్థాయిలో ఆరోసారి ట్రోఫీని కైవసం చేసుకున్న ఆస్ట్రేలియాకు చెందిన నలుగురు ఆటగాళ్లు.. ఆ జట్టులో స్థానం దక్కించుకున్నారు. వెస్టిండీస్ మాజీ ఆటగాడు ఇయాన్ బిషప్, ఆస్ట్రేలియ మాజీ మహిళా క్రికెటర్ మెలానీ జోన్స్‌తో సహా నిపుణుల బృందం ఈ జట్టును ఎంపిక చేసింది.
19 ఏళ్ల రిచా ఘోష్.. గ్రూప్ దశలో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌తో పాటు ఆసీస్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో అంతగా రాణించలేదు. కానీ, మిగతా మూడు మ్యాచుల్లో రాణించి నాటౌట్‌గా నిలిచింది. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 31 పరుగులు, వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 44 పరుగులు, వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 47 పరుగులు సాధించి రిచా అజేయంగా నిలిచింది.
మహిళల టీ20 ప్రపంచకప్‌లో అత్యంత విలువైన జట్టు
- తజ్మిన్ బ్రిట్స్ (దక్షిణాఫ్రికా) - 37.20 సగటుతో 186 పరుగులు
- అలిస్సా హీలీ (ఆస్ట్రేలియా) - 47.25 సగటుతో 189 పరుగులు,4 వికెట్లు
- లారా వోల్వార్డ్ట్ (దక్షిణాఫ్రికా) - 46.00 సగటుతో 230 పరుగులు
- నాట్ స్కివర్-బ్రంట్ (సి) (ఇంగ్లాండ్) - 72.00 సగటుతో 216 పరుగులు
- ఆష్లీ గార్డనర్ (ఆస్ట్రేలియా) - 36.66 సగటుతో 110 పరుగులు, 10 వికెట్లు
- రిచా ఘోష్ (భారత్) - 68.00 సగటుతో 136 పరుగులు
- సోఫీ ఎక్లెస్టోన్ (ఇంగ్లాండ్) - 7.54 సగటుతో 11 వికెట్లు
- కరిష్మా రామ్‌హారక్ (వెస్టిండీస్) - 5 వికెట్లు
- షబ్నిమ్ ఇస్మాయిల్ (దక్షిణాఫ్రికా) - 8 వికెట్లు
- డార్సీ బ్రౌన్ (ఆస్ట్రేలియా) - 7 వికెట్లు
- మేగన్ షట్ (ఆస్ట్రేలియా) - 10 వికెట్లు
- ఓర్లా ప్రెండర్‌గాస్ట్ (ఐర్లాండ్) - 27.25 సగటుతో 109 పరుగులు, 3 వికెట్లు
కాగా, ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టు వికెట్లు కోల్పోయినా దూకుడు తగ్గించలేదు. ముఖ్యంగా బేత్ మూనీ ఆకాశమే హద్దుగా చెలరేగింది. 53 బంతుల్లో 74 పరుగులు (9 ఫోర్లు, 1 సిక్స్) చేసింది. మూనీ మినహా.. మిగతా ఆటగాళ్లందరూ 30 కంటే తక్కువే పరుగులు చేశారు. గార్డ్‌నర్ 29 పరుగులు (21 బంతుల్లో, 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) చేసింది. ఆస్ట్రేలియా అమ్మాయిలు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మరిజన్నె కాప్ 2, షబ్నిమ్ ఇస్మాయిల్ 2 వికెట్లు తీయగా.. మ్లాబా, ట్రయాన్ తలో వికెట్ తీశారు.
157 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 17 పరుగుల వద్ద టాజ్మిన్ బ్రిటిస్(10) వికెట్‌ను కోల్పోయింది. అనంతరం దక్షిణాఫ్రికా వికెట్లను కాపాడుకునే యత్నంలో మెల్లగా ఆడింది. దాంతో రన్‌రేట్ పెరిగిపోయి చివరకు ఓటమి పాలైంది. 10 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయి 52 పరుగులే చేసిన సఫారీలు.. ఆపై తేరుకోలేకపోయారు. దక్షిణాఫ్రికా ఓపెనర్ లౌరా(61; 48 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేసినా జట్టును గెలిపించలేకపోయింది. దక్షిణాఫ్రికా 137 పరుగులకే పరిమితమై ఓటమి చెందింది.