ETV Bharat / sports

IND vs PAK: 'మళ్లీ క్రికెట్​ మ్యాచ్​లు జరగాలి!' - టీమ్ఇండియా

దాయది దేశాలైన భారత్​-పాకిస్థాన్​ జట్ల మధ్య తిరిగి క్రికెట్​ మ్యాచ్​లు కొనసాగాలని పాక్​ మాజీ కెప్టెన్​ ఇంజమామ్​-ఉల్​-హక్(Injamamul Haque)​ ఆశాభావం వ్యక్తం చేశాడు. యాషెస్​ సిరీస్(Ashes Series)​ కంటే ఈ ఇరు జట్ల మధ్య పోటీనే ఎక్కువ మంది ఆస్వాదిస్తారని అన్నాడు. భారత్​-పాకిస్థాన్​ కలిసి ఆడే రోజుల కోసం తానెంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

Inzamam-ul-haq wishes India vs Pakistan bilateral cricketing activities resume
IND vs PAK: 'మళ్లీ క్రికెట్​ మ్యాచ్​లు జరగాలి!'
author img

By

Published : Jun 11, 2021, 7:05 AM IST

భారత్‌-పాకిస్థాన్‌ జట్ల మధ్య తిరిగి క్రికెట్‌ కొనసాగాలని.. ద్వైపాక్షిక సిరీస్‌లు జరగాలని ఆ జట్టు మాజీ సారథి ఇంజమామ్‌-ఉల్‌-హక్‌(Injamamul Haque)​ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇటీవలే ఓ క్రీడాఛానెల్‌తో మాట్లాడిన సందర్భంగా అతడీ వ్యాఖ్యలు చేశాడు. యాషెస్‌ సిరీస్‌(Ashes Series)​ కన్నా దాయాదుల పోరే ఎక్కువగా చూస్తారన్నాడు. ఆ క్షణాలను అభిమానులు పూర్తిగా ఆస్వాదిస్తారని చెప్పాడు.

"యాషెస్‌ సిరీస్‌ కన్నా ఎక్కువ ప్రజలు భారత్‌-పాక్‌ మ్యాచ్‌లను వీక్షిస్తారు. ఇందులో ప్రతి క్షణాన్ని వారు ఆస్వాదిస్తారు. ఇరు జట్ల మధ్య ఆట బలోపేతానికి, ఆటగాళ్ల అభివృద్ధికి ఆసియా కప్‌తో పాటు ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం ఎంతో ముఖ్యం. మేం టీమ్‌ఇండియాతో ఆడే రోజుల్లో గొప్ప అనుభూతి కలిగేది. అలాంటి ద్వైపాక్షిక సిరీస్‌ల్లో సీనియర్ల నుంచి యువకులు నేర్చుకునే అవకాశం కూడా ఉంటుంది. సచిన్‌, గంగూలీ, అజహరుద్దీన్‌, జావెద్‌ మియాందాద్‌ ఇలా ఎవరైనా కానీ కొత్తగా జట్టులోకి వచ్చిన ఆటగాళ్లు వారి దగ్గరికెళ్లి విలువైన సలహాలు, సూచనలు తెలుసుకునేవాళ్లు. ఒక క్రికెటర్‌ తన ఆటను అత్యుత్తమంగా తీర్చిదిద్దుకొనేందుకు అదో సువర్ణ అవకాశం."

- ఇంజమామ్​-ఉల్​-హక్​, పాకిస్థాన్​ మాజీ కెప్టెన్​

తాము ఆడే రోజుల్లో ఇరు జట్ల మధ్య తీవ్రమైన పోటీ ఉండేదని, అయినా చివరికి ఇరు జట్ల ఆటగాళ్లకు ఒకరంటే ఒకరు ఎంతో గౌరవించుకునే వారని ఇంజమామ్‌ గుర్తుచేసుకున్నాడు. భారత్‌-పాక్‌ జట్ల మధ్య తిరిగి క్రికెట్‌ జరగాలని ఉందని, అందుకోసం తాను ఎదురుచూస్తున్నానని పేర్కొన్నాడు.

అయితే, 2004లో సౌరవ్​ గంగూలీ(Ganguly) నేతృత్వంలోని టీమ్‌ఇండియా(Team india) చారిత్రక పాకిస్థాన్‌ పర్యటనకు వెళ్లొచ్చారు. అప్పుడు భారత్‌ 2-1తో టెస్టు సిరీస్‌, 3-2తో వన్డే సిరీస్‌ కైవసం చేసుకుంది. ఈ క్రమంలోనే 2005లో భారత పర్యటనకు వచ్చిన దాయాది జట్టు 3-2తో వన్డే సిరీస్‌ గెలుపొందగా టెస్టు సిరీస్‌ను డ్రాగా ముగించింది. చివరగా 2013లో ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక టీ20, వన్డే సిరీస్‌లు జరగ్గా.. పొట్టి సిరీస్‌ డ్రాగా ముగిసింది. వన్డే సిరీస్‌ 2-1 పాకిస్థాన్‌ కైవసం చేసుకుంది. అనంతరం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినడం వల్ల ఐసీసీ ఈవెంట్లలో తప్ప మరెక్కడా తలపడటం లేదు.

ఇదీ చూడండి.. గంగూలీ నా పెళ్లికి వచ్చారు: పాక్ క్రికెటర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.