ETV Bharat / sports

'ఆ విషయంలో హార్దిక్ పాండ్యను మించిన వాళ్లు లేరు' - హార్దిక్ పాండ్య షాహిద్‌ అఫ్రిది

Shahid Afridi On Hardik Pandya : టీమ్​ ఇండియా ఆల్​ రౌండర్​ హార్దిక్ పాండ్యపై పాకిస్థాన్​ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది ప్రశంసల వర్షం కురిపించాడు. పాం​డ్య లాంటి ప్లేయర్ మా జట్టులో లేడని కొనియాడాడు. ఇంకా ఏం అన్నాడంటే..

hardik pandya
hardik pandya
author img

By

Published : Sep 28, 2022, 7:48 AM IST

Shahid Afridi On Hardik Pandya : ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే పాకిస్థాన్‌ మాజీ ఆల్‌రౌండర్‌ షాహిద్‌ అఫ్రిది.. భారత ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యపై ప్రశంసలు కురిపించాడు. అతడి లాంటి ఫినిషర్‌ పాకిస్థాన్‌కు లేడని అన్నాడు. పాక్‌ జట్టులో పలువురు ఉన్నప్పటికీ వాళ్లు రాణించడంలేదని పేర్కొన్నాడు. 'హార్దిక్‌ లాంటి ఫినిషర్‌ మాకు లేడు. అసిఫ్‌ అలీ, ఖుష్‌దిల్‌ ఆ పాత్ర పోషిస్తారని భావించినప్పటికీ.. వారు రాణించలేకపోతున్నారు. నవాజ్‌, షాదాబ్‌ కూడా ఆకట్టుకోవడంలేదు. ఈ నలుగురిలో కనీసం ఇద్దరైనా రాణించాలి' అని అన్నాడు.

బౌలింగ్‌తోపాటు బ్యాటింగ్‌ విభాగాల్లో జట్టులోని లోపాలను సరిచేసుకోవాలని అఫ్రిది సూచించాడు. అలా అయితేనే వచ్చే నెలలో జరిగే ప్రపంచకప్‌లో రాణించగలరని పేర్కొన్నాడు. ప్రపంచకప్‌ సాధించాలని పాక్‌ జట్టు కలలు కంటే.. అందుకు తగినట్లుగా బౌలింగ్‌, బ్యాటింగ్‌ విభాగాలను తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. కొద్దిరోజులుగా చేస్తున్న తప్పులను పునరావృతం చేయకూడదని జట్టుకు సూచించాడు.

గాయం నుంచి కోలుకున్న హార్దిక్‌ పాండ్య ఆపై విశేషంగా రాణిస్తున్నాడు. భారత టీ20 లీగ్‌లో మొదటిసారి భాగమైన గుజరాత్‌ జట్టుకు సారథ్యం వహిస్తూ.. తొలి సీజన్‌లోనే ఆ జట్టుకు ట్రోఫీని అందించాడు. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో పలు మ్యాచ్‌లను గెలిపించాడు. భారత జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తూ.. అదే ఫామ్‌ను కొనసాగించిన పాండ్య సంచలన ఇన్నింగ్స్‌తో జట్టుకు విజయాన్నందించాడు.

ఆసియా కప్‌లో గ్రూప్‌ మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో 17 బంతుల్లో 33 నాటౌట్‌గా నిలిచి గెలిపించాడు. తర్వాత జరిగిన ఆస్ట్రేలియాతో సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో 30 బంతుల్లోనే ఏకంగా 71 పరుగుల నాటౌట్‌తోపాటు నిర్ణయాత్మక మూడో టీ20లోనూ 25 రన్స్‌తో జట్టును విజయ తీరాలకు చేర్చాడు. వికెట్లు సైతం తీస్తూ జట్టులో తనవంతు పాత్ర పోషిస్తున్నాడు.

ఇవీ చదవండి: IND VS SA: సఫారీతో ఢీ.. జోరు మీదున్న టీమ్​ఇండియా.. కానీ అదొక్కట

IND VS SA: సఫారీతో ఢీ.. జోరు మీదున్న టీమ్​ఇండియా.. కానీ అదొక్కటే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.