ETV Bharat / sports

WTC Final: 'కివీస్ గెలవదు.. కారణాలివే..' - కోహ్లీ

ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్ ఫైనల్​పై(WTC Final) భారత క్రికెట్ దిగ్గజం గావస్కర్ జోస్యం చెప్పాడు. ఈ మ్యాచ్​లో న్యూజిలాండ్​కు పరాభవం తప్పదని పేర్కొన్నాడు. అందుకు గల కారణాలను తెలిపాడు.

sunil gavaskar, former indian cricketer
సునీల్ గావస్కర్, భారత క్రికెట్ దిగ్గజం
author img

By

Published : May 30, 2021, 7:32 PM IST

ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్ ఫైనల్​లో న్యూజిలాండ్ ఘోర పరాభవం చవిచూస్తుందని అభిప్రాయపడ్డాడు క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్​. అందుకు గల కారణాలను వెల్లడించాడు.

"డబ్ల్యూటీసీ ఫైనల్​ గెలవడానికి కివీస్​కే ఎక్కువ అవకాశాలున్నాయని చాలా మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంగ్లాండ్​తో టెస్టు సిరీస్ ఆడడం వల్ల విలియమ్సన్ సేనకు తగిన ప్రాక్టీస్ లభిస్తుందనుకుంటున్నారు. దీంతో టీమ్ఇండియాపై న్యూజిలాండ్ సునాయాసంగా నెగ్గుతుందని చెబుతున్నారు. కానీ, నేను ఇంకో కోణాన్ని ఆవిష్కరించాను. ఈ సిరీస్​లో విలియమ్సన్​ సేన రెండు మ్యాచ్​ల్లో ఓడిపోతే.. వారిపై ఒత్తిడి ఉంటుంది. దీంతో కోహ్లీ సేన పని సులువు అవుతుంది. ఈ సిరీస్​ సందర్భంగా ప్రత్యర్థి జట్టులో ప్రధాన ఆటగాళ్లు గాయపడే ప్రమాదం లేకపోలేదు. ఈ టెస్టులు ముగిశాక భారత్​తో తలపడటానికి మరో నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంటుంది.. దీంతో ఆటగాళ్లు పూర్తి శక్తిసామర్థ్యాలతో బరిలోకి దిగలేరు. ఈ కారణాల వల్ల డబ్ల్యూటీసీ ఫైనల్​లో కివీస్ ఓడిపోయే ఆస్కారం ఉంది" అని గావస్కర్ పేర్కొన్నాడు.

"ఇప్పుడు టీమ్​ఇండియా తగినంత విశ్రాంతి తీసుకుంటోంది. ఇంగ్లాండ్​లోనూ వారికి చాలా సమయం ఉంటుంది. స్వేచ్ఛగా బరిలోకి దిగుతారు. మానసిక ఒత్తిళ్లు ఉండవు. కాబట్టి టెస్టు ఛాంపియన్​షిప్​ గెలవడానికి కోహ్లీ సేనకు అవకాశం ఉంటుంది" అని గావస్కర్ పేర్కొన్నాడు.

ఇవీ చదవండి:

'హీరోలా చేయకు'- సైనిపై ట్రోల్స్​

బిడ్డకు జన్మనివ్వనున్న స్వలింగ జంట

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.