Mohammed Shami World Cup 2023 : ఈ ఏడాది ప్రపంచకప్‌లో తన అద్భుతమైన బౌలింగ్ స్కిల్స్‌తో జట్టును కీలక సమయాల్లో ఆదుకున్నాడు టీమ్ఇండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ. తుదిజట్టులోకి ఆలస్యంగా వచ్చినప్పటికీ షమి సంచలన ప్రదర్శనలు చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. పిచ్ బౌలింగ్‌కు గొప్పగా అనుకూలించకపోయినప్పటికీ వికెట్లు తీస్తూ ప్రత్యర్థులను హడలెత్తించాడు. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో 24 వికెట్లు తీసి అత్యధిక వికెట్ల తీసిన బౌలర్‌గా రికార్డుకెక్కాడు. అతడి ప్రదర్శనకు మెచ్చిన మాజీలు షమీని ప్రశంసలతో ముంచెత్తారు. క్రికెట్ అభిమానులు కూడా షమీ ఆట తీరుకు ఫిదా అయిపోయారు. అయితే వరల్డ్ కప్ ఓటమితో అతడు తీవ్రంగా కుంగిపోయాడు. ఈ నేపథ్యంలో టీమా్ మేట్స్‌తో పాటు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు.
అయితే వరల్డ్ కప్ తర్వాత పలువులు సీనియర్ స్టార్స్‌తో పాటు షమీ కూడా విశ్రాంతి తీసుకుంటున్నాడు. రెస్ట్ తీసుకున్నాక మరికొన్ని రోజుల్లో సౌతాఫ్రికాతో జరగనున్న టెస్టు సిరీస్ కోసం అక్కడికి బయలుదేరనున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు మాట్లాడాడు. అంతే కాకుండా తనపై వచ్చిన విమర్శలకు ఘూటుగా స్పందించాడు.
"ప్రపంచకప్ ఫైనల్‌లో ఓటమి తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో ఎవరూ ఎవరితోనూ మాట్లాడలేదు. కనీసం ఎవరూ ఏమి తినలేదు. అయితే డ్రెస్సింగ్ రూమ్‌కు ప్రధాని నరేంద్ర మోడీ అకస్మాతుగా వచ్చారు. దీంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. మా అందరితో ఆయన మాట్లాడారు. ఆయన మాటలు మాకు ఎంతో ఊరటనిచ్చాయి.'' అని షమి చెప్పుకొచ్చాడు.
మరోవైపు వరల్డ్ కప్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో షమీ ఐదు వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆనందంతో షమి మోకాళ్లపై కూర్చొని రెండు చేతులతో నేలను టచ్ చేశాడు. ఇది చూసేందుకు కాస్త నమాజ్ చేస్తున్నట్టుగా అనిపించిందని కొంతమంది తప్పుబట్టారు. తాజాగా ఈ విషయంపై కూడా షమి స్పందించాడు. తనదైన స్టైల్లో చురకలు అంటించాడు.
''నమాజ్ చేయాలనుకుంటే నన్ను ఎవరు ఆపుతారు? నమాజ్ చేసేటప్పుడు నన్ను ఎవరు కూడా అడ్డుకోరు. నమాజ్ చేయాలనుకుంటే చేస్తాను. ఇందులో సమస్య ఏంటి? నేను గర్వించదగిన ముస్లింనని చెప్పుకుంటాను. ఓ భారతీయుడినంటూ గర్వంగా పేర్కొంటాను. గతంలో 5 వికెట్లు తీసినప్పుడు నమాజ్ చేశానా? నేను చాలా సార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాను. ఇక నేను ఎక్కడ ప్రార్థన చేయాలో మీరే చెప్పండి. అక్కడికి వెళ్లి నమాజ్ చేస్తాను'' అని షమి పేర్కొన్నాడు.
శభాష్ షమీ - ఒక్క పనితో మనసు గెలిచేశావ్!
షమీ కోసం బీసీసీఐ స్పెషల్ రిక్వెస్ట్- అర్జునా అవార్డు రేసులో స్టార్ పేసర్