ETV Bharat / sports

ఏడు సార్లు వరల్డ్​ కప్​ విన్నర్​​ - అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు! - మెగ్‌ లాన్నింగ్‌ కెరీర్​

Meg Lanning Retirement : ఆస్ట్రేలియా మ‌హిళా జ‌ట్టు కెప్టెన్ మేగ్ లానింగ్ ఓ సంచ‌ల‌న నిర్ణయం తీసుకుంది. అంత‌ర్జాతీయ క్రికెట్‌కు ఆమె రిటైర్మెంట్​ ప్రకటించింది.

Meg Lanning Retirement
Meg Lanning Retirement
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 9, 2023, 11:07 AM IST

Meg Lanning Retirement : తన రిటైర్మెంట్​ వార్తతో ఆస్ట్రేలియా జట్టుకు షాకిచ్చింది కెప్టెన్​ మెగ్‌ లాన్నింగ్‌. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి వైదొలుగుతున్నట్లు తాజాగా ప్రకటించింది. అంతే కాకుండా ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన సమయమని ఆమె పేర్కొంది. అయితే మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌లో మెల్‌బోర్న్‌ స్టార్స్‌కు కెప్టెన్‌గా కొనసాగుతానని ప్రకటించింది. కానీ లాన్నింగ్‌ సడెన్​గా ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు.

"క్రికెట్‌కు వీడ్కోలు ప‌ల‌కాల‌నుకోవ‌డం ఓ క‌ష్ట‌మైన నిర్ణ‌య‌మే. కానీ, నాకు ఇదే స‌రైన స‌మ‌యం అనిపించింది. 13 ఏళ్లు అంత‌ర్జాతీయ క్రికెట్ ఆడటం అదృష్టంగా భావిస్తున్నాను. ఇన్నేళ్ల జర్నీలో జ‌ట్టు స‌భ్యుల‌తో అపూర్వ క్ష‌ణాల‌ను గడిపాను. నాకు ఇష్ట‌మైన ఆట‌లో ఉన్న‌త శిఖ‌రాలు అధిరోహించేందుకు ఎంత‌గానో స‌హ‌క‌రించిన‌ కుటుంబ స‌భ్యులు, జ‌ట్టు స‌భ్యులు, క్రికెట్ విక్టోరియా, క్రికెట్ ఆస్ట్రేలియా, ఆసీస్ క్రికెట‌ర్ల‌కు నా హృదయపూర్వక ధ‌న్య‌వాదాలు" అని లానింగ్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

నాలుగు పొట్టి కప్పులు.. ఏడు ప్రపంచ కప్​లు..
Meg Lanning Stats : 18 ఏళ్ల వ‌య‌సులో అరంగేట్రం చేసిన ఈ స్టార్​ ప్లేయర్​.. తొలుత టీ20ల్లో ఆడింది. ఆ తర్వాత వ‌న్డే, టెస్టు జట్టులోకి వ‌చ్చింది. తన సార‌థ్యంలో ఆసీస్ 4 సార్లు పొట్టి ప్రపంచ‌క‌ప్ విజేత‌గా నిలిచింది. 13 ఏళ్ల కెరీర్‌లో లాన్నింగ్‌.. 132 టీ20లు, 103 వ‌న్డేలు ఆడింది. ఆరు టెస్టు మ్యాచ్‌ల‌కు సార‌థ్యం వ‌హించింది. ఆమె కెప్టెన్సీలో ఆసీస్​ జ‌ట్టు 69 వ‌న్డేల్లో, 100 టీ20ల్లో, 4 టెస్టుల్లో గెలుపొందింది.

ఓ ఫుల్‌టైమ్‌ బ్యాటర్​గా పార్ట్‌ టైమ్‌ బౌలర్​గా జట్టుకు అనేక సేవలు అందించింది. అంతే కాకుండా తన కెరీర్​లో 17 సెంచరీలు, 38 హాఫ్‌ సెంచరీలు, 5 వికెట్లు పడగొట్టింది. ఏడు వరల్డ్‌కప్‌ టైటిళ్లలో భాగమైంది. మూడు రకాల ఫార్మెట్లలో 241 మ్యాచ్​లు ఆడి 8,352 పరుగులు సాధిచింది. మ‌హిళ‌ల ప్రీమియ‌ర్ లీగ్ తొలి సీజ‌న్‌లో దిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టుకు సార‌థిగా వ్య‌వ‌హ‌రించింది.

ఆస్ట్రేలియా ఆల్​రౌండ్​ షో - ఇంగ్లాండ్​పై గ్రాండ్ విక్టరీ, సెమీస్ రేస్ నుంచి డిఫెండింగ్ ఛాంప్ ఔట్!

ఏడోసారి ప్రపంచకప్​ నెగ్గిన ఆసీస్​.. ఫైనల్లో ఇంగ్లాండ్​ చిత్తు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.