ETV Bharat / sports

రెండో టీ20 మ్యాచ్​కు కూడా వర్షం ముప్పు.. ఆందోళనలో ఫ్యాన్స్​ - టీమ్​ఇండియా కివీస్​తో మూడు టీ20లు

Ind Vs Nz T20: ఇంగ్లాండ్​ పర్యటనలో ఉన్న టీమ్​ఇండియా.. కివీస్​తో రెండో టీ20 మ్యాచ్​ ఆడేందుకు సిద్ధమయ్యింది. అయితే ఆదివారం కూడా వర్షం పడే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఫ్యాన్స్​ తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

team india
టీమ్​ఇండియా
author img

By

Published : Nov 20, 2022, 10:51 AM IST

Ind Vs Nz T20 Rain : టీ20 ప్రపంచకప్ నుంచి నిష్క్రమించిన తర్వాత టీమ్​ఇండియా నేరుగా న్యూజిలాండ్​ పర్యటనకు వెళ్లింది. కివీస్​తో నేడు భారత్..​ రెండో టీ20 మ్యాచ్​ను బే ఓవల్ మైదానం వేదికగా ఆడనుంది. ఈ మ్యాచ్‌లో రెండు జట్లు హోరాహోరీగా తలపడేందుకు సిద్ధమయ్యాయి. అయితే ఈ ప్రాంతంలో మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ విషయం తెలుసుకున్న్ అభిమానులు చాలా ఆందోళన చెందుతున్నారు. టీ20ల్లో భారత జట్టు భవిష్యత్తు నిర్ణయించడానికి ఈ సిరీస్ కీలకమని అంతా అనుకుంటున్న సమయంలో సిరీస్ ఇలా వర్షం కారణంగా జరగకపోతే ఎలా? అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బే ఓవల్ మైదానంలో పిచ్ ఎక్కువగా బ్యాటర్లకే సహకారం అందిస్తుంది. అంటే బౌలర్లకు ఏమాత్రం సహకారం ఉండదని కాదు. బ్యాటర్లు పరిస్థితులను చక్కగా ఉపయోగించుకోగలుగుతారు. అలాగే ఇక్కడ చివరిగా జరిగిన రెండు అంతర్జాతీయ టీ20ల్లో ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టే విజయం సాధించింది. దీంతో భారత్, న్యూజిలాండ్ మ్యాచ్‌లో కూడా అలాంటి ఫలితమే ఆశించొచ్చు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఈ పిచ్‌పై తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు కేవలం 145 మాత్రమే కావడం గమనార్హం.

టీ20 సిరీస్‌లో భాగంగా జరగాల్సిన తొలి మ్యాచ్ ఇప్పటికే వర్షం కారణంగా రద్దయ్యింది. వెల్లింగ్టన్ వేదికగా జరగాల్సిన ఆ మ్యాచ్‌లో కనీసం టాస్ కూడా పడలేదు. వర్షం భారీగా పడింది. దీంతో చాలా సేపు ఎదురు చూసిన ఫ్యాన్స్.. చివరకు మ్యాచ్ రద్దవడంతో చాలా నిరాశ పడ్డారు. వర్షం కారణంగా ఇరు జట్లు మ్యాచ్​ ఆడకుండానే వెనుతిరగాల్సి వచ్చింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.