Kohli vs South Africa: టీమ్ఇండియా టెస్టు సారథి కోహ్లీ అభిమానులను నిరాశపరిచే వార్త ఒకటి నెట్టింట్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టుకు వెన్నునొప్పి కారణంగా దూరమైన విరాట్.. వన్డే సిరీస్‌కు కూడా అందుబాటులో ఉండడని తెలిసింది. కుటుంబంతో గడపాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాడట. ఈ విషయం గురించి ఇప్పటికే బీసీసీఐకు సమాచారం కూడా ఇచ్చాడని తెలుస్తోంది. కాగా, మరి మూడో టెస్టుకు కూడా అందుబాటులో ఉంటాడో లేదో కూడా స్పష్టత లేదు.
ఇప్పటికే వన్డే సిరీస్‌కు గాయం కారణంగా హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ కూడా దూరమయ్యాడు. అతడి స్థానంలో కేఎల్ రాహుల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు.
ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్టుకు కూడా కేఎల్ రాహులే కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. కాగా, రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా బ్యాటర్లు తడబడ్డారు. కేఎల్ రాహుల్ (50) అర్ధసెంచరీతో రాణించగా.. స్పిన్నర్ అశ్విన్ (46) ఆకట్టుకున్నాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 202 పరుగులకు పరిమితమైంది భారత జట్టు. ఛేజింగ్‌లో తొలి రోజు ఆట ముగిసేసరికి దక్షిణాఫ్రికా 35/1 స్కోరుతో నిలిచింది.
ఇదీ చదవండి: IND vs SA: తొలి రోజు ముగిసిన ఆట.. దక్షిణాఫ్రికా 35/1