ETV Bharat / sports

పాక్ సూప‌ర్ లీగ్‌లో దంచికొట్టిన మాజీ క్రికెటర్​ కొడుకు.. తండ్రి జట్టునే ఓడించి..

మాజీ క్రికెట‌ర్ మొయిన్ ఖాన్ కుమారుడు ఆజ‌మ్ ఖాన్​.. పాకిస్థాన్​ సూపర్​ లీగ్​లో రెచ్చిపోయాడు. భారీ షాట్లతో అదరగొట్టాడు. కేవలం 42 బంతుల్లో 97 పరుగులు సాధించాడు. ప్రస్తుతం సోషల్​మీడియాలో అతడి బ్యాటింగ్​ వీడియోలు వైరల్​గా మారాయి.

paksithan super league
paksithan super league
author img

By

Published : Feb 25, 2023, 11:06 AM IST

Updated : Feb 25, 2023, 3:10 PM IST

పాకిస్థాన్ సూప‌ర్ లీగ్​లో భాగంగా టీ20 మ్యాచ్‌లో.. మాజీ క్రికెట‌ర్ మొయిన్ ఖాన్ కుమారుడు ఆజ‌మ్ ఖాన్ దుమ్మురేపాడు. భారీ షాట్ల‌తో అల‌రించాడు. దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ తండ్రికి షాకిచ్చాడు. ఇస్లామాబాద్ యునైటెడ్ జ‌ట్టు త‌ర‌పున ఆజ‌మ్ బ్యాటింగ్ చేశాడు. ఇక క్వెట్టా గ్లేడియ‌ట‌ర్స్‌కు కోచ్‌గా మొయిన్ ఖాన్ ఉన్నాడు. అయితే శుక్ర‌వారం రాత్రి జ‌రిగిన మ్యాచ్‌లో ఆజ‌మ్ ఖాన్ చెల‌రేగి తండ్రి జట్టునే ఓడించాడు!

తొలుత బ్యాటింగ్ చేసిన ఇస్లామాబాద్ యునైటెడ్ టీమ్​.. 10 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు కోల్పోయి 71 ర‌న్స్ మాత్ర‌మే చేసింది. ఆ ద‌శ‌లో క్రీజ్‌లోకి వ‌చ్చిన ఆజ‌మ్ ఖాన్ త‌న ప‌వ‌ర్ హిట్టింగ్‌తో త‌న విశ్వరూపం చూపించాడు. భారీ కాయుడైన ఆజ‌మ్ భారీ షాట్ల‌తో ఆక‌ట్టుకున్నాడు. అత‌డు కేవ‌లం 42 బంతుల్లో 97 ర‌న్స్ చేశాడు.

హాఫ్ సెంచ‌రీ పూర్తి స‌మ‌యంలో స్టాండ్స్‌లో ఉన్న తండ్రికి సిగ్న‌ల్ కూడా ఇచ్చాడు ఆజ‌మ్‌. ఈ ఇస్లామాబాద్ హిట్ట‌ర్ త‌న ఇన్నింగ్స్‌లో 8 సిక్స‌ర్లు, 9 ఫోర్లు కొట్టాడు. దీంతో ఆ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్ల న‌ష్టానికి 220 ర‌న్స్ చేసింది. భారీ టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన క్వెట్టా జ‌ట్టు 19.1 ఓవ‌ర్ల‌లో 157 ర‌న్స్‌కు ఆలౌటైంది. దీంతో ఈ మ్యాచ్​లో ఇస్లామాబాద్​ యునైటెట్​ టీమ్​ విజయం సాధించింది.

Last Updated : Feb 25, 2023, 3:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.