2017 ఐపీఎల్‌లో రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్, ఫైనల్ చేరడంలో అప్పటి కెప్టెన్ స్టీవ్‌స్మిత్ పాత్ర ఏమీలేదని, అందుకు ధోనీనే కారణమని ఆ జట్టు ఆటగాడు రజత్ భాటియా చెప్పాడు. ఓ క్రీడా ఛానెల్‌కు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని పంచుకున్నాడు.
ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసుల నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై 2015లో రెండేళ్లు నిషేధం విధించారు. దీంతో 2016, 2017 సీజన్లలో ఆ జట్లు లీగ్‌లో ఆడలేదు.
అయితే, ఆయా ఆటగాళ్లు మాత్రం గుజరాత్ లయన్స్, రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ తరఫున ఆడారు. ఈ క్రమంలోనే ధోనీ పుణె తరఫున బరిలో దిగగా, స్టీవ్‌స్మిత్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ సీజన్‌లో పుణె ఫైనల్ చేరింది. లీగ్ దశలో 14 మ్యాచ్‌ల్లో 9 విజయాలు, 5 ఓటములతో ప్లేఆఫ్స్‌కు చేరగా, ఫైనల్లో ముంబయి ఇండియన్స్‌తో తలపడి, ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి 20 ఓవర్లలో 129/8 స్వల్ప స్కోరే నమోదు చేసినా పుణె 128/6కే పరిమితమైంది. అయితే, అప్పుడు తమ జట్టు ఫైనల్ చేరడానికి ధోనీనే కారణమని రజత్ పేర్కొన్నాడు.
'స్టీవ్‌స్మిత్‌ను మీరెప్పుడూ ధోనీతో పోల్చిచూడకూడదు. నా దృష్టిలో టాప్ 10 కెప్టెన్ల జాబితాలోనూ స్మిత్ ఉండడు. మేం 2017లో ఫైనల్‌కు చేరడంలో ధోనీ పాత్ర కీలకం. అలాగే రాజస్థాన్ రాయల్స్ గతేడాది స్మిత్‌ను కెప్టెన్‌గా చేసినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే కీలక సమయాల్లో అతడు తీసుకునే నిర్ణయాలు సరిగ్గా ఉండవు' అని మాజీ ఐపీఎల్ ఆటగాడు వివరించాడు.
2017తో నిషేధం పూర్తి చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ మరుసటి ఏడాది వచ్చీ రాగానే టైటిల్ సాధించింది. దాంతో మూడోసారి ఐపీఎల్ ట్రోఫీ నెగ్గిన జట్టుగా నిలిచింది. గతేడాది మరీ ఘోరమైన ప్రదర్శన చేసిన చెన్నై.. వచ్చే వారం నుంచి ప్రారంభమయ్యే 14వ సీజన్‌లో ఎలా రాణిస్తుందో చూడాలి?