రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్సీ(rcb captain news) నుంచి తప్పుకొంటున్నట్లు ఇటీవలే వెల్లడించాడు విరాట్ కోహ్లీ(rcb virat kohli). సారథిగా ఈ సీజనే తనకు చివరిదని ప్రకటించాడు. దీంతో కోహ్లీ(rcb virat kohli) తర్వాత ఆర్సీబీకి కెప్టెన్(rcb captain news) ఎవరా అన్న ప్రశ్న అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. కొందరు డివిలియర్స్‌కు కెప్టెన్సీ ఇవ్వాలంటూ కోరుతుండగా, మరికొందరు యువ ఆటగాడికి సారథ్యం(rcb captain news) ఇస్తే దీర్ఘకాలం జట్టుకు సేవలందించగలడని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ విషయంపై స్పందించాడు ఈ ఫ్రాంచైజీ మాజీ పేసర్ డెయిల్ స్టెయిన్(dale steyn rcb).
"ఒకవేళ ఆర్సీబీ కనుక దీర్ఘకాలం కెప్టెన్సీ గురించి ఆలోచిస్తే సొంత ఆటగాడిని ఎంపిక చేయడం మేలు. నాకు తెలిసినంత వరకు ఫ్రాంచైజీ రాహుల్‌ను కెప్టెన్‌గా నియమిస్తుందని అనుకుంటున్నా. వచ్చే సీజన్ కోసం జరిగే వేలంలో ఇతడు బెంగళూరుకు తిరిగి వస్తాడని భావిస్తున్నా. "
-స్టెయిన్, ఆర్సీబీ మాజీ పేసర్
ప్రస్తుతం పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు రాహుల్. 2018లో బెంగళూరు నుంచి పంజాబ్ ఇతడిని రూ.11 కోట్లకు కొనుగోలు చేసింది.
ప్రస్తుతం ఆర్సీబీ జట్టులో సీనియర్ ప్లేయర్ అయిన డివిలియర్స్ కుడా కెప్టెన్సీ(rcb captain news) రేసులో ముందున్నాడు. అయితే దీనిపైనా స్పందించిన స్టెయిన్(dale steyn rcb).. ఒక అనుభవమున్న ఆటగాడిగా ఏబీడీ.. రాహుల్ సారథ్యంలో ఆడాలని సూచించాడు. ప్రస్తుతం అతడు కెరీర్ చివరి దశలో ఉన్నాడని పేర్కొన్నాడు.
ఆర్సీబీకి టైటిల్ ఆశలు
ఈ సీజన్(IPL 2021 News)లో ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు చేరువలో ఉంది. ఆదివారం ముంబయి ఇండియన్స్(mi vs rcb 2021)తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించిన ఈ జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది(పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి). ఇప్పటివరకు ఈ లీగ్‌లో ఆరు విజయాలు నమోదు చేసింది. కెప్టెన్‌గా కోహ్లీ(rcb virat kohli)కి ఇదే చివరి సీజన్ కావున ఎలాగైన టైటిల్ గెలవాలన్న కృతనిశ్చయంతో ఉన్నారు ఆటగాళ్లు.