ETV Bharat / sports

టాప్​ గేర్​లో బుమ్రా.. ఫుల్ ప్రాక్టీసులో ముంబయి! - Bumrah mumbai indians

ఇటీవల పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడైనా స్టార్ బౌలర్ బుమ్రా.. ఇప్పుడు ఐపీఎల్ బరిలో దిగేందుకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం చెన్నైలో జట్టుతో కలిసి ప్రాక్టీసు చేస్తున్నాడు. గత కొన్ని సీజన్ల నుంచి ముంబయి తరఫున ఆకట్టుకునే ప్రదర్శనలు చేసిన ఇతడు.. ఈసారి ఎలా ఆడతాడో చూడాలి.​

Jasprit Bumrah Completes Bowling Drill In Style, Hits Top Gear Ahead Of IPL 2021
టాప్​ గేర్​లో బుమ్రా.. ఫుల్ ప్రాక్టీసులో ముంబయి!
author img

By

Published : Apr 5, 2021, 4:52 PM IST

ఐపీఎల్ త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని జట్లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కప్పు కొట్టాలనే ప్రణాళికతో చెమట చిందిస్తున్నాయి. డిపెండింగ్ ఛాంపియన్​ ముంబయి ఇండియన్స్ కూడా అంతే స్థాయిలో సన్నద్ధమవుతోంది. ఈ జట్టులోని స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ప్రాక్టీసులో యార్కర్లు వేస్తూ కనిపించాడు. అందుకు సంబంధించిన ఓ వీడియోను ముంబయి ఫ్రాంచైజీ ఇన్​స్టాలో పోస్ట్ చేసింది.

ముంబయి తరఫున 2013లో ఐపీఎల్​ అరంగేట్రం చేసిన బుమ్రా.. అప్పటినుంచి రెగ్యులర్​ బౌలర్​గా కొనసాగుతున్నాడు. కీలక సమయాల్లో కెప్టెన్ రోహిత్ శర్మ, ఇతడికే బౌలింగ్​ఇచ్చేందుకు సిద్ధపడతాడంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. తనపై జట్టుపై నమ్మకాన్ని ప్రస్తుత సీజన్​లోనూ నిలబెట్టేందుకు బుమ్రా సిద్ధమవుతున్నాడు.

Jasprit Bumrah Completes Bowling Drill In Style
జస్ప్రీత్ బుమ్రా

ముంబయి ఇండియన్స్, ఈ సీజన్​లోని తొలి మ్యాచ్​లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. చెన్నై మైదానం దీనికి వేదిక కానుంది. మొత్తంగా చైన్నైలో ఐదు, దిల్లీలో నాలుగు, బెంగళూరులో మూడు, కోల్​కతాలో రెండు మ్యాచ్​లు ఆడనుంది రోహిత్​సేన.

ఇది చదవండి: బుమ్రాను అందుకే పెళ్లి చేసుకున్నా: సంజనా గణేశన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.